RCBw Vs DCw: డబ్ల్యూపీఎల్‌లో డబుల్‌ బొనాంజా.. దిల్లీతో మ్యాచ్‌.. టాస్‌ నెగ్గిన ఆర్‌సీబీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో దిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన ఆర్‌సీబీ సారథి స్మృతీ మంధాన బౌలింగ్‌ ఎంచుకుంది.

Updated : 05 Mar 2023 15:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అట్టహాసంగా ప్రారంభమైన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2023) తొలి సీజన్‌ రెండో రోజు డబుల్‌ హెడ్డర్స్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBw), దిల్లీ క్యాపిటల్స్ (DCw) జట్ల మధ్య మ్యాచ్‌ మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ స్మృతీ మంధాన టాస్ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకుంది. దిల్లీ జట్టుకు మెగ్‌లానింగ్ సారథ్యం వహిస్తోంది. 

ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం తొలుత బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే అంచనాతో బరిలోకి దిగుతున్నట్లు ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతీ మంధాన తెలిపింది. పిచ్‌ మీద గ్రాస్‌ ఉండటం వల్ల తమ సీమర్లు ప్రభావం చూపిస్తారని వెల్లడించింది. తొలుత తమ జట్టు బ్యాటింగ్‌ చేయడం నిరుత్సాహానికి గురి చేస్తుందని, అయితే తప్పకుండా మంచి గేమ్‌ ఆడతామని దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ వ్యాఖ్యానించింది. 

జట్లు వివరాలు: 

దిల్లీ: షఫాలీ వర్మ, మెగ్‌ లానింగ్ (కెప్టెన్), మరిజన్నె కాప్, జెమీమా రోడ్రిగ్స్, ఎలిస్ కాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్

బెంగళూరు: స్మృతీ మంధాన (కెప్టెన్), సోఫీ డెవిన్, దిశా కసత్, ఎల్సే పెరీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, కనికా అహుజ, ఆషా శోభన, ప్రీతి బోస్, మెగన్ స్కట్, రేణుకా సింగ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని