BCCI: భారత క్రికెటర్ల మెనూపై వివాదం.. స్పష్టతనిచ్చిన బీసీసీఐ

న్యూజిలాండ్‌తో నవంబరు 25 (గురువారం) నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో భారత క్రికెటర్ల మెనూపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌..

Published : 24 Nov 2021 09:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌తో నవంబరు 25 (గురువారం) నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో భారత క్రికెటర్ల మెనూపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ స్పష్టతనిచ్చాడు. ఆటగాళ్ల ఆహారపు అలవాట్లపై బీసీసీఐ జోక్యం చేసుకోదని ప్రకటించారు. ‘ఆటగాళ్ల డైట్ ప్లాన్‌కు సంబంధించి మేమెలాంటి నిబంధనలు విధించలేదు. ఆటగాళ్లు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చు. అది శాకాహారమా.?, మాంసాహారమా.? అనేది వారిష్టం’ అని అరుణ్‌ ధూమల్ పేర్కొన్నాడు.

కాన్పూర్‌ వేదికగా జరుగనున్న తొలి టెస్టులో భారత క్రికెటర్ల ఆహారంలో పంది, గోవు మాంసాలను నిషేధించడమే కాక.. హలాల్‌ చేసిన మాంసాన్నే ఆటగాళ్లకు అందించబోతున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఆటగాళ్లు తినే ఆహారంపై ఆంక్షలు విధించడమేంటని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుతో పాటు న్యూజిలాండ్‌ జట్టులో కూడా ముస్లిం ఆటగాళ్లు ఉండటంతో హలాల్‌ చేసిన మాంసాన్ని అందించాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని