IND vs ENG: ఎవరైనా సాధన చేయగలరు కానీ టోర్నీలో ఆడరు: ఇర్ఫాన్‌ పఠాన్‌

వికెట్‌కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ అందుబాటులో లేకపోవడంతో చివరి మూడు టెస్టులకు ఎంపిక చేయలేదని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌  తెలిపాడు.  ఇషాన్ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దీనిపై మాజీ క్రికెటర్‌ స్పందించాడు.

Published : 11 Feb 2024 02:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan) ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘ఎవరైనా ప్రాక్టీస్‌ చేయగలరు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం పాల్గొనరు.’’ అని పఠాన్‌ రాసుకొచ్చాడు. దానిలో ఎవరి పేరూ ప్రస్తావించకపోయినా ఇషాన్‌ కిషన్‌నే అన్నాడని ఫ్యాన్స్‌ స్పందిస్తున్నారు.

ఇండియన్‌ వికెట్‌కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి మూడు టెస్టులకూ ఎంపిక కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీల్లో సైతం పాల్గొనడం లేదు. జట్టు ఎంపిక సమయంలో అతడు అందుబాటులో లేకపోవడంతో పరిగణలోకి తీసుకోలేదని భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) తెలిపాడు. కానీ అతడు తాజాగా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తోన్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

దీనిపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా (Akash Chopra) మాట్లాడుతూ ‘‘రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పింది నిజం. జట్టులో ఎంపిక కావాలంటే ముందు అందుబాటులోకి రావాలి. అలాగే నిరంతరం క్రికెట్‌ ఆడుతూ ఉండాలి. ప్రస్తుతం రంజీ ట్రోఫీ జరుగుతోంది. ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని అక్కడ నిరూపించుకోవాలి. ఎంపిక సమయంలో ఇషాన్‌ కిషన్‌ ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు’’అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని