జకో @ 1

పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ తిరిగి నంబర్‌వన్‌ ర్యాంకు సాధించాడు.

Published : 31 Jan 2023 02:52 IST

మెల్‌బోర్న్‌: పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ తిరిగి నంబర్‌వన్‌ ర్యాంకు సాధించాడు. సోమవారం ప్రకటించిన పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో అల్కారస్‌ (స్పెయిన్‌)ను పక్కకి నెట్టి టాప్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. అల్కారస్‌, సిట్సిపాస్‌ (గ్రీస్‌), రూడ్‌ (నార్వే), రుబ్లెవ్‌ (రష్యా) వరుసగా టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. రఫెల్‌ నాదల్‌ రెండు నుంచి ఆరో ర్యాంకుకు పడిపోయాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత సబలెంకా (బెలారస్‌) మహిళల జాబితాలో రెండో ర్యాంకు సాధించింది. స్వైటెక్‌ (పోలెండ్‌) అగ్రస్థానంలో ఉండగా.. జాబెర్‌ (ట్యునీసియా), పెగులా (అమెరికా), గార్సియా (ఫ్రాన్స్‌) వరుసగా 3, 4, 5 ర్యాంకులు సాధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు