ఇంకో టోర్నీ మాత్రమే..

భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా కెరీర్లో ఇంకో టోర్నీ మాత్రమే ఆడనుంది.

Published : 08 Feb 2023 03:09 IST

అబుదాబి: భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా కెరీర్లో ఇంకో టోర్నీ మాత్రమే ఆడనుంది. అబుదాబి ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో బరిలో దిగిన ఆమె తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సానియా, బెథానీ మాటెక్‌ (అమెరికా) జోడీ 3-6, 4-6తో క్రిస్టెన్‌ ఫ్లిప్కెన్స్‌ (బెల్జియం), లౌరా సిగ్మెండ్‌ (జర్మనీ) చేతిలో పరాజయంపాలైంది. దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్‌ తన కెరీర్లో ఆఖరి టోర్నీ అని సానియా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ఆరంభంకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు