అశ్విన్ నాణ్యమైన స్పిన్నరే కానీ..
భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ గురించి తాము మరీ ఎక్కువగా ఆలోచించట్లేదని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు.
నాగ్‌పుర్: భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ గురించి తాము మరీ ఎక్కువగా ఆలోచించట్లేదని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. అశ్విన్ నాణ్యమైన స్పిన్నరే అయినా.. అతణ్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని చెప్పాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌లో తమకు స్పిన్ ముప్పు ఉంటుందని అంచనా వేస్తున్న ఆసీస్.. స్పిన్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తోంది. అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేశ్ పితియా అనే స్పిన్నర్‌ను ఉపయోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో అశ్విన్ గురించి ఆస్ట్రేలియా ఎక్కువగా ఆలోచిస్తుందా అన్న ప్రశ్నకు స్మిత్ స్పందిస్తూ.. ‘‘ప్రాక్టీస్‌లో మేం ఎంతో మంది స్పిన్నర్లను ఎదుర్కొంటున్నాం. అందులో మహేశ్ ఒకడు. అతడు అశ్విన్‌లాగే బౌలింగ్ చేస్తాడు. మేం ఎక్కువగా ఆలోచించట్లేదు. అశ్విన్ నాణ్యమైన స్పిన్నర్. కానీ అతణ్ని ఎదుర్కోవడానికి అవసరమైన ఉపకరణాలు కిట్ బ్యాగ్‌లో ఉన్నాయి’’ అని చెప్పాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన