Wasim Akram - Bumrah: బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమం

ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రానే అత్యుత్తమ బౌలర్‌ అని పాకిస్థాన్‌ మాజీ స్టార్‌ వసీమ్‌ అక్రమ్‌ కితాబిచ్చాడు.

Updated : 31 Oct 2023 07:41 IST

దిల్లీ: ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రానే(Bumrah) అత్యుత్తమ బౌలర్‌ అని పాకిస్థాన్‌ మాజీ స్టార్‌ వసీమ్‌ అక్రమ్‌(Wasim Akram) కితాబిచ్చాడు. ‘‘ఇంగ్లాండ్‌ బ్యాటర్లను బుమ్రా భలే బోల్తా కొట్టించాడు. గొప్ప వేగంతో బంతులు వేశాడు. ముఖ్యంగా రౌండ్‌ ద వికెట్‌లో లెఫ్ట్‌ హ్యాండర్లు ఆడలేని రీతిలో బంతులు సంధించాడు. అతడి లెంగ్తే బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. తొలి ఓవర్లోనే కొన్ని బంతులను ఇన్‌స్వింగ్‌ చేసిన బుమ్రా... ఒకట్రెండు ఔట్‌ స్వింగర్లు కూడా వేశాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌ వేగం, లెంగ్త్‌ అద్భుతం. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అతడే అత్యుత్తమ బౌలర్‌. నియంత్రణతో కూడిన వేగం, వైవిధ్యం వల్లే బుమ్రా స్థిరంగా రాణించగలుగుతున్నాడు. ఔట్‌ స్వింగర్లను నా మాదిరే వేస్తున్నాడు. అంతేకాదు కొన్నిసార్లు నన్ను మించిన నియంత్రణతో బౌలింగ్‌ చేస్తున్నాడు’’ అని అక్రమ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. బుమ్రా బౌలింగ్‌ చేసే తీరు అక్రమ్‌ కొత్త బంతితో బంతులు వేసే విధానాన్ని గుర్తుకు తెస్తోందని మరో పాక్‌ మాజీ స్టార్‌ మిస్బావుల్‌ హక్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని