Balakrishna: బాలయ్య ఇంటికి టైటాన్స్‌

ప్రొ కబడ్డీ సీజన్‌-10లో హైదరాబాద్‌ అంచెకు వేళైంది. శుక్రవారం నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ఈ లీగ్‌ జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లు నగరానికి చేరుకున్నాయి.

Updated : 19 Jan 2024 08:27 IST

హైదరాబాద్‌, ఈనాడు: ప్రొ కబడ్డీ సీజన్‌-10లో హైదరాబాద్‌ అంచెకు వేళైంది. శుక్రవారం నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ఈ లీగ్‌ జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లు నగరానికి చేరుకున్నాయి. స్థానిక జట్టు తెలుగు టైటాన్స్‌ గురువారం లీగ్‌ ప్రచారకర్త నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లింది. జెర్సీని బహూకరించింది. ఈ సందర్భంగా టైటాన్స్‌ లీగ్‌లో రాణించాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. శుక్రవారం బెంగళూరు బుల్స్‌తో టైటాన్స్‌.. పట్నాతో యూపీ తలపడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని