పాక్‌ 181/0.. ఇంగ్లాండ్‌ 657 ఆలౌట్‌

పాకిస్థాన్‌-ఇంగ్లాండ్‌ తొలి టెస్టులో పరుగుల వరద పారుతోంది. ఫ్లాట్‌ పిచ్‌ మీద ఇంగ్లాండ్‌ కేవలం నాలుగు సెషన్లలో 657 పరుగులు చేసి ఔరా అనిపిస్తే..

Updated : 03 Dec 2022 05:07 IST

రావల్పిండి: పాకిస్థాన్‌-ఇంగ్లాండ్‌ తొలి టెస్టులో పరుగుల వరద పారుతోంది. ఫ్లాట్‌ పిచ్‌ మీద ఇంగ్లాండ్‌ కేవలం నాలుగు సెషన్లలో 657 పరుగులు చేసి ఔరా అనిపిస్తే.. పాకిస్థాన్‌ కూడా ఆ జట్టుకు దీటుగా స్పందిస్తోంది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ ఆట ఆఖరుకు 51 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 181 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలా దూకుడుగా ఆడకపోయినా.. పాక్‌ ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్‌ (89; 158 బంతుల్లో 10×4, 2×6), ఇమాముల్‌ హక్‌ (90; 148 బంతుల్లో 13×4, 1×6) నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ జట్టును మంచి స్థితిలో నిలిపారు. అయితే ఆ జట్టు ఇంకా 476 పరుగులు వెనుకబడి ఉండడంతో మూడో రోజు పూర్తిగా బ్యాటింగ్‌ చేయకుంటే ఫాలోఆన్‌ ముప్పు తప్పకపోవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 506/4తో బ్యాటింగ్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. ఇంకో 151 పరుగులు చేసి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన బ్రూక్‌ 153 పరుగుల వద్ద వెనుదిరిగాడు. పాక్‌ బౌలర్లలో జహిద్‌ మహమూద్‌ 4, నసీమ్‌ షా 3 వికెట్లు పడగొట్టారు. తొలి రోజు 75 ఓవర్ల ఆటే సాధ్యం కాగా.. రెండో రోజు 77 ఓవర్లే పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని