WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌తో యువ ప్రతిభకు ప్రోత్సాహం..!: హర్మన్ ప్రీత్
మహిళల ప్రీమియర్ లీగ్ వల్ల ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులకు ప్రోత్సాహం లభిస్తుందని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ మార్చిలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ వల్ల ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుందని భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అన్నారు. మహిళల క్రికెట్ మరింత మెరుగుపడటానికి ఇది చక్కటి అవకాశమన్నారు.
‘‘ఐపీఎల్ ద్వారా పురుషుల క్రికెట్ ఎంతగా మెరుగుపడుతోందో మనం చూస్తూనే ఉన్నాం. మహిళల ఐపీఎల్‌లోనూ కచ్చితంగా అదే జరుగుతుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ లీగ్ ప్రాముఖ్యతను సొంతం చేసుకుంటుంది. దీని వల్ల యువ ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తుంది. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ మధ్య ఉన్న నిడివిని ఇది భర్తీ చేస్తుంది. యువ క్రీడాకారిణులు దేశవాళీ క్రికెట్ నుంచి నేరుగా అంతర్జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం చాలా కష్టం. ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈ లీగ్ వల్ల అది సులభం అవుతుంది’’ అని పేర్కొన్నారు. ఇక టీమ్ ఇండియా జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ..‘‘మేము ఎప్పుడూ దూకుడుగా ఆడటానికే ప్రయత్నిస్తాం. టీమ్ మీటింగ్స్‌లోనూ అదే చర్చిస్తాం. పిచ్ ఎలా ఉన్నా పట్టించుకోం. బ్యాటింగ్‌కు దిగే ముందు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ఆట ప్రారంభిస్తాం. మా స్ట్రెక్‌రేట్ పట్ల అప్రమత్తంగా ఉంటాం’’ అని తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
India News
Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్ ఇచ్చిన సలహా
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/03/2023)
-
Sports News
భిన్నమైన మేళవింపులు ప్రయత్నిస్తున్నాం.. కోచ్ రాహుల్ ద్రవిడ్
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు