IPL-SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు షాక్.. మూడు మ్యాచ్‌లకు కీలక ఆటగాడు దూరం

ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌కు షాక్ తగిలింది. హైదరాబాద్‌ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు స్పిన్నర్‌ వానిందు హసరంగ దూరం కానున్నాడు. 

Updated : 19 Mar 2024 17:19 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌కు షాక్ తగిలింది. ఈ సారి జట్టుకు ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు శ్రీలంక లెగ్‌ స్పిన్నర్‌ వానిందు హసరంగ (Wanindu Hasaranga) దూరంకానున్నాడు. జాతీయ జట్టు విధుల కారణంగా అతడు ఐపీఎల్‌-2024 సీజన్‌ కోసం భారత్‌కు ఆలస్యంగా రానున్నాడు. గతేడాది జరిగిన మినీ వేలంలో హసరంగను రూ.1.5 కోట్లకు సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసింది. 2023 ఆగస్టులో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అతడు తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌తో మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న రెండు టెస్టుల సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. ఈ సిరీస్‌ ఏప్రిల్ 3న ముగియనుంది. అనంతరం హసరంగ భారత్‌కు చేరుకుని ఎస్‌ఆర్‌హెచ్‌ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. అతడు గత మూడు సీజన్లలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 26 మ్యాచ్‌లు ఆడి 35 వికెట్లు పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని