Heath Streak: నేను బతికే ఉన్నా.. అలాంటి రూమర్స్‌ బాధించాయి: హీత్‌ స్ట్రీక్

జింబాబ్వే క్రికెట్‌ దిగ్గజం హీత్ స్ట్రీక్‌ (Heath Streak) మరణ వార్తలపై స్వయంగా అతడే స్పందించాడు. ఇలాంటి రూమర్లను వ్యాప్తి చేయడం వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు పేర్కొన్నాడు.

Updated : 23 Aug 2023 13:21 IST

(ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: తాను మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో కథనాలు రావడంపై జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్‌ స్ట్రీక్‌ (Heath Streak) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి కథనాలు మానసికంగా బాధకు గురి చేశాయని పేర్కొన్నాడు. తాను క్యాన్సర్‌తో పోరాడుతూనే ఉన్నానని, బతికే ఉన్నట్లు స్పష్టం చేశాడు. ‘‘నేను కన్నుమూసినట్లు వచ్చిన వార్తలన్నీ రూమర్లే. అదంతా అబద్ధం. బతికే ఉన్నా.  చాలా బాగున్నా. ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే ఇలాంటి విషయాన్ని వ్యాప్తి చేయడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. మరీ ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో  సోషల్‌ మీడియాలో ఇలాంటివి ఎక్కువై పోయాయి. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేసిన వారు క్షమాపణలు చెబుతారని ఆశిస్తున్నా. ఇవి నన్నెంతో బాధించాయి’’ అని మీడియాతో స్ట్రీక్‌ మాట్లాడాడు.

కలవరం రేపిన ఒలొంగ ట్వీట్‌

తొలుత హీత్ స్ట్రీక్‌ తుది శ్వాస విడిచినట్లు జింబాబ్వే మాజీ ఆటగాడు హెన్రీ ఒలొంగ ట్విటర్ వేదికగా (ప్రస్తుతం ఎక్స్‌) వెల్లడించాడు. అయితే, కాసేపటికే తన పొరపాటును సరి చేసుకుంటూ మరొక ట్వీట్ చేశాడు. ‘‘జింబాబ్వే క్రికెట్‌ దిగ్గజం హీత్ స్ట్రీక్‌ మరణ వార్తలన్నీ రూమర్లే. స్ట్రీక్‌ అద్భుతంగా కోలుకుంటున్నాడు. అతడితో నేరుగా మాట్లాడా. మూడో అంపైర్ (క్రికెట్ పరిభాషలో) స్ట్రీక్‌ను వెనక్కి పిలిపించాడు. అతడు చాలా బాగున్నాడు’’ అంటూ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు