112 ఓవర్లకు ఆస్ట్రేలియా 357/9

టీమ్‌ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్‌‌ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న లైయన్‌‌(24; 22బంతుల్లో 4x4) వాషింగ్టన్‌...

Updated : 16 Jan 2021 07:24 IST

బ్రిస్బేన్‌: టీమ్‌ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్‌‌ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న లైయన్‌‌(24; 22బంతుల్లో 4x4) వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో ఆసీస్‌ 354 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ టిమ్‌పైన్‌(50) అర్ధశతకం సాధించాక శార్దుల్‌ ఠాకుర్‌ వేసిన 100వ ఓవర్‌లో స్లిప్‌లో రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌లోనే కామెరూన్‌ గ్రీన్(47) వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. మరుసటి ఓవర్‌లోనే మళ్లీ శార్దుల్‌ ఠాకుర్‌ బౌలింగ్‌లో కమిన్స్‌(2) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మిచెల్‌ స్టార్క్‌(17), హేజిల్‌వుడ్‌(2) ఉన్నారు. 112 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 357/9గా నమోదైంది.

ఇవీ చదవండి..
అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు
అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా‌‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని