IND vs NZ: రెండో సెషన్‌ పూర్తి.. కివీస్‌ ఆధిపత్యం..!

టీమ్‌ఇండియా టీ బ్రేక్‌ విరామ సమయానికి 56 ఓవర్లలో 154/4 స్కోర్‌తో నిలిచింది. క్రీజులో శ్రేయస్‌ అయ్యర్‌ (17; 55 బంతుల్లో 2x4), రవీంద్ర జడేజా (6; 13 బంతుల్లో 1x4) ఉన్నారు...

Published : 25 Nov 2021 14:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కివీస్‌తో జరుగుతున్న తొలిటెస్టులో టీమ్‌ఇండియా టీ విరామ సమయానికి 56 ఓవర్లలో 154/4 స్కోర్‌తో నిలిచింది. క్రీజులో శ్రేయస్‌ అయ్యర్‌ (17; 55 బంతుల్లో 2x4), రవీంద్ర జడేజా (6; 13 బంతుల్లో 1x4) ఉన్నారు. భోజన విరామానికి 82/1తో పటిష్ఠ స్థితిలో నిలిచిన భారత్‌.. రెండో సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. సెషన్‌ మొదలైన తొలి ఓవర్‌లోనే జేమీసన్‌.. గిల్‌ (52; 93 బంతుల్లో 5x4, 1x6)ను బౌల్డ్‌ చేయగా కాసేపటికే టిమ్‌సౌథీ.. ఛెతేశ్వర్‌ పుజారా (26; 88 బంతుల్లో 2x4)ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత జేమీసన్‌.. కెప్టెన్‌ అజింక్య రహానె (35; 63 బంతుల్లో 6x4)ను ఔట్‌ చేసి భారత్‌కు గట్టి షాకిచ్చాడు. క్రీజులో ఉన్న శ్రేయస్‌, జడేజా మరో వికెట్‌ పడకుండా రెండో సెషన్‌ను పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని