IND vs WI: ఆఖరి రెండు టీ20లూ వెస్టిండీస్‌లోనేనా?

భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరగాల్సిన ఆఖరి రెండు టీ20 మ్యాచ్‌లను కూడా కరీబియన్‌ గడ్డపైనే నిర్వహించాలని చూస్తోంది విండీస్‌ క్రికెట్‌ బోర్డు...

Updated : 02 Aug 2022 06:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరగాల్సిన ఆఖరి రెండు టీ20 మ్యాచ్‌లను కూడా కరీబియన్‌ గడ్డపైనే నిర్వహించాలని చూస్తోంది విండీస్‌ క్రికెట్‌ బోర్డు. పలువురి ఆటగాళ్లకు ఇంకా అమెరికా వీసా రానందునే ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే టరౌబాలోని బ్రియన్‌ లారా స్టేడియంలో తొలి టీ20 జరగ్గా.. ఆగస్టు 1, 2 తేదీల్లో సెంట్‌ కిట్స్‌లోని వార్నర్‌ పార్క్‌ స్టేడియంలో రెండు, మూడు మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేశారు. ఈ క్రమంలోనే 6, 7 తేదీల్లో నాలుగు, ఐదు టీ20లను అమెరికాలోని ఫ్లోరిడాలో ఏర్పాటు చేశారు.

కాగా, ఆ చివరి రెండు మ్యాచ్‌లు ఈ వారమే జరగాల్సి ఉండగా ఇప్పటికీ పలువురు ఆటగాళ్లకు అమెరికా వీసాలు మంజూరు కాలేదు. మరోవైపు విండీస్‌ క్రికెట్‌ బోర్డు వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే, అనుకున్న సమయానికి ఆటగాళ్లకు వీసాలు రాకపోతే ముందు జాగ్రత్త చర్యగా విండీస్‌లోనే ఆ చివరి రెండు మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని