WTC Final: ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు.. భారత్ తుది జట్టు ఇదేనా?
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC Final 2023) విజేతగా నిలిచే అవకాశం మరోసారి టీమ్‌ఇండియాకు వచ్చింది. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడేందుకు భారత్ సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు (WTC Final) దూసుకెళ్లిన టీమ్‌ఇండియా (Team India).. నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, భారత తుది జట్టుపై మాత్రం అభిమానుల్లో సందిగ్ధత తొలగలేదు. పిచ్‌పై పచ్చిక కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, బౌలింగ్‌కే అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలా..? నలుగురు పేసర్లను ఆడించాలా అనేది మేనేజ్‌మెంట్ ముందున్న సమస్య. ఈ క్రమంలో భారత తుది జట్టు ఎలా ఉండనుందో ఓ అంచనా వేద్దాం..
బ్యాటింగ్‌లో వీరే...
కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె బ్యాటింగ్ చేస్తారు. భారత్‌కు ఎదురయ్యే తొలి సమస్య.. కీపర్ ఎవరు..? ఎందుకంటే ఎడమ చేతివాటం బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ పోటీ పడుతున్నాడు. లెఫ్ట్‌హ్యాండ్ కాంబినేషన్ కావాలనుకుంటే ఇషాన్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే, టెస్టుల్లో కీపింగ్ ఆషామాషీ వ్యవహారం కాదు. రోజంతా చేయాల్సి ఉంటుంది. అందుకే ఇషాన్‌కు బదులు భరత్‌ను తీసుకోవాలని మాజీలు సలహాలు ఇచ్చారు.
బౌలింగ్ కూర్పు ఎలా..?
ఇంగ్లాండ్ పిచ్‌లు పేస్‌కు అనుకూలం. ఇది కాదనలేని సత్యం. ముగ్గురు పేసర్లు ఉండాల్సిందే. షమీ, సిరాజ్ తుది జట్టులో ఉంటారు. మూడో ఫాస్ట్‌బౌలర్ రేసులో జయదేవ్ ఉనద్కత్ లేదా ఉమేశ్ యాదవ్ అనేది తేలాలి. లెఫ్ట్‌ఆర్మ్ పేసర్ కావాలంటే ఉనద్కత్‌ను ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంది. ఇక స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అతడు బ్యాటింగ్‌లోనూ నమ్మదగ్గ ఆటగాడు. ఇప్పటి వరకు ఆరుగురు బ్యాటర్లు, ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లు తేలిపోయారు. ఇక చివరి స్థానంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది పేసరా...? స్పిన్నర్ అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ బ్యాటర్ కమ్ పేసర్ అయితే శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవచ్చు. చివరి రెండు రోజులు స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందనే వాదనా ఉంది కాబట్టి అశ్విన్ వైపు మొగ్గు చూపొచ్చు. వీరిద్దరూ బ్యాటింగ్‌లో అండగా ఉండగలరు.
తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్/శార్దూల్, ఉమేశ్/జయదేవ్, షమీ, సిరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు