CWG 2022 : సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళల హాకీ జట్టు

భారత మహిళల జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో హకీ విభాగంలో క్వార్టర్‌ఫైనల్‌లో 3-2 తేడాతో కెనడాపై టీమ్‌ఇండియా అద్భుత..

Updated : 03 Aug 2022 20:20 IST

జూడో మహిళల విభాగంలో మరొక పతకం ఖాయం

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మహిళల జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో హకీ విభాగంలో క్వార్టర్‌ఫైనల్‌లో 3-2 తేడాతో కెనడాపై టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. పూల్‌ -ఏ చివరి మ్యాచ్‌లో విజయంతో సెమీస్‌ బెర్తును భారత్‌ ఖరారు చేసుకుంది. మూడో క్వార్టర్‌ వరకు 2-2తో సమంగా నిలిచిన ఇరు జట్లు.. చివరి క్వార్టర్‌లో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో భారత్‌ గెలుపొందింది. పూల్‌-ఏలో రెండో స్థానంతో స్టేజ్‌దశను భారత్‌ ముగించింది. దీంతో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది.

మహిళల 45-48 కేజీల విభాగం క్వార్టర్‌ఫైనల్‌లో నికోల్‌ స్లైడ్‌తో భారత్‌ బాక్సర్‌ నీతూ తలపడుతోంది. ఇక జూడోలో 78+ కేజీల మహిళల విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన సైడ్నీ ఆండ్రూస్‌ను ఓడించి భారత్ క్రీడాకారిణి తులికా మాన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఈ విభాగంలో మరొక పతకం భారత్‌ సొంతం కానుంది. లాన్‌బౌల్స్‌ మహిళల పెయిర్స్‌ రౌండ్‌ -3లో దక్షిణాఫ్రికా, భారత్‌ పోటాపోటీగా ఆడుతున్నాయి. ప్రస్తుతం 12-12తో సమంగా కొనసాగుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని