హార్దిక్‌ భార్య పోస్ట్‌ తొలగించిన ఇన్‌స్టా?

2020.. అందరినీ హడలెత్తిస్తోంటే టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్యకు మాత్రం కలిసొచ్చింది. గతేడాది డిసెంబర్‌ 31న నటాషా స్టాంకోవిచ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. దుబాయ్‌లో సముద్ర జలాల్లో విహరిస్తూ ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. వెన్నుముక గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు....

Updated : 27 Feb 2024 19:08 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: 2020.. అందరినీ హడలెత్తిస్తోంటే టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్యకు మాత్రం కలిసొచ్చింది. గతేడాది డిసెంబర్‌ 31న నటాషా స్టాంకోవిచ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. దుబాయ్‌లో సముద్ర జలాల్లో విహరిస్తూ ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. వెన్నుముక గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. నటాషాను పెళ్లిచేసుకున్నాడు. ఈ మధ్యే తండ్రయ్యాడు. వాయిదా పడిన ఐపీఎల్‌-2020 సైతం ఇప్పుడు మొదలవుతోంది.

కొత్తగా తండ్రైన పాండ్యకు కుటుంబాన్ని వదిలి దుబాయ్‌కు వెళ్లడం అంత సులభమేమీ కాదు. కానీ నిబంధనల దృష్ట్యా అతడు బయో బుడగలో అడుగుపెట్టాల్సిందే. జట్టు సభ్యులతో పాటు ముంబయి ఇండియన్స్‌ శిబిరంలోనే ఉండాలి. మళ్లీ బయటకు వచ్చే అవకాశం లేదు. ఇన్ని ఆంక్షల నడుమ తన భార్య, కుమారుడిని పాండ్య వదిలి ముంబయి శిబిరానికి చేరిపోయాడు. ఈ నేపథ్యంలోనే అతడిని చాలా మిస్సవుతున్నానని సతీమణి నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. కమ్యూనిటీ మార్గదర్శకాల ప్రకారం ఆక్షేపణీయంగా ఉందని ఆ చిత్రాన్ని ఇన్‌స్టా తొలగించడం గమనార్హం. ఈ వ్యవహారం నటాషాకు కోపం తెప్పించినట్టుంది! ‘నిజంగానేనా@ఇన్‌స్టా’ అని ఆమె ఇన్‌స్టా రీల్స్‌ పోస్ట్‌ చేసింది.

యూఏఈ వేదికగా సెప్టెంబర్‌19 నుంచి ఐపీఎల్‌-2020 మొదలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా ముప్పు ఉండటంతో నిర్వాహకులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులు వెళ్లేందుకు బీసీసీఐ అడ్డేమీ చెప్పలేదు. కాకపోతే ఆటగాళ్లను కలవకూడదని, వేరుగా ఉండాలని నిబంధనలు విధించింది. ఫ్రాంచైజీలకే మొత్తం భారం వదిలేసింది. ఇప్పటి వరకైతే ఏ జట్టూ కుటుంబ సభ్యులకు అనుమతించినట్టు సమాచారం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని