IPL 2022: అభిమానుల ప్రేమే మాకు అమితానందం: చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఎక్కడికెళ్లినా అభిమానులు ప్రేమగా చూసే చూపులే తమకు అమితానందాన్ని కలిగిస్తాయని చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ అంటోంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌-2022 మెగా ఈవెంట్‌ కోసం...

Updated : 14 Mar 2022 20:24 IST

సూరత్‌లో మొదలైన ధోనీసేన ప్రాక్టీస్‌

సూరత్‌: ఎక్కడికెళ్లినా అభిమానులు ప్రేమగా చూసే చూపులే తమకు అమితానందాన్ని కలిగిస్తాయని చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ అంటోంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌-2022 మెగా ఈవెంట్‌ కోసం ఆ జట్టు ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది. సూరత్‌లోని లాల్‌భాయ్‌ కాంట్రాక్టర్‌ స్టేడియంలో కెప్టెన్‌ ధోనీతో సహా పలువురు ఆటగాళ్లు సోమవారం నుంచి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం వద్దకు తరలివచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే ట్విటర్‌లో షేర్‌ చేసింది. అలాగే ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది.

కాగా, చెన్నై గతేడాది నాలుగోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2020లో ఘోర పరాభవం పాలైన ధోనీసేన 2021లో మెరుగైన ప్రదర్శన చేసింది. ఇక ఈ సీజన్‌లో కొత్తగా రెండు జట్లు రాబోతున్న నేపథ్యంలో మెగా వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో అంతకుముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ రిటెన్షన్‌లో నలుగురు కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. అందులో కెప్టెన్‌ ధోనీ, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీని తమ వద్దే ఉంచుకొని మిగతా ఆటగాళ్లను వదిలేసుకుంది. ఈ క్రమంలోనే మళ్లీ వేలంలో తమ పాత ఆటగాళ్లు అంబటి రాయుడు, రాబిన్‌ ఉతప్ప, డ్వేన్‌ బ్రావో, దీపక్‌ చాహర్‌ లాంటి వారిని తిరిగి కొనుగోలు చేసింది. దీంతో ఈ సీజన్‌లోనూ సగానికి పైగా ఆటగాళ్లు పాతవారే ఉండటం గమనార్హం.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని