GT vs CSK: గుజరాత్‌ బోణీ.. చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans)కు ఐపీఎల్‌-16 (IPL 16) సీజన్‌లో అదిరే ఆరంభం. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. రుతురాజ్‌ గైక్వాడ్ (92) దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

Updated : 31 Mar 2023 23:54 IST

అహ్మదాబాద్‌: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans)కు ఐపీఎల్‌-16 (IPL 16) సీజన్‌లో అదిరే ఆరంభం. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. రుతురాజ్‌ గైక్వాడ్ (92) దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని హార్దిక్‌ సేన.. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్‌ గిల్ (63; 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వృద్ధీమాన్‌ సాహా (25; 16 బంతుల్లో), ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్‌ (22; 17 బంతుల్లో), విజయ్‌ శంకర్‌ (27; 21 బంతుల్లో), రషీద్‌ ఖాన్‌ (10 ), రాహుల్ తెవాతియా (15 ) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌ మూడు, రవీంద్ర జడేజా, తుషార్‌ దేశ్‌పాండే తలో వికెట్ పడగొట్టారు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన సీఎస్కే (CSK) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్ (92; 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు)  త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. మొయిన్‌ అలీ (23; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), శివమ్‌ దూబె (19), ధోనీ (14), అంబటి రాయుడు (12),  బెన్‌ స్టోక్స్‌ (7) పరుగులు చేశారు.  గుజరాత్‌ బౌలర్లలో రషీద్ ఖాన్‌, అల్జారీ జోసెఫ్‌, షమి తలో రెండు వికెట్లు పడగొట్టగా.. లిటిల్ ఒక్క వికెట్ తీశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని