Rahul Dravid : అప్పుడే ఇషాన్‌ను జట్టు సెలక్షన్‌కు పరిగణిస్తాం : రాహుల్‌ ద్రవిడ్‌

అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశావళి క్రికెట్‌ నుంచి ఇషాన్‌ సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ స్పందించాడు.

Published : 06 Feb 2024 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : గత కొంతకాలంగా జట్టుకు దూరమైన ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan)పై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) స్పందించాడు. ఆట ఆడటం ఎప్పుడు ప్రారంభిస్తాడో అతడు నిర్ణయించుకోవాలని.. ఆ తర్వాతే అతడిని జాతీయ జట్టు ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశావళి క్రికెట్‌ నుంచి ఇషాన్‌ సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే.

వ్యక్తిగత కారణాలతో గత డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్‌ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో కూడా ఆడటం లేదు. దీనిపై విశాఖ టెస్టు విజయం అనంతరం ద్రవిడ్‌ స్పందిస్తూ..‘‘జట్టులోకి తిరిగి రావడానికి ఎవరికైనా మార్గం ఉంది. అతడు విరామం కావాలని అడిగాడు. అందుకు మేం అంగీకరించాం. అతడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నా.. కొంచెం క్రికెట్‌ ఆడి తిరిగి రావాలి. అతడి విషయంలో మేం బలవంతం చేయడం లేదు’ అని పేర్కొన్నాడు.

డబ్ల్యూటీసీ టేబుల్‌లో దూసుకొచ్చిన భారత్

ఇక రెండు టెస్టుల్లో కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ పెద్దగా ఆకట్టుకోని విషయం తెలిసిందే. దీనిపై కోచ్‌ స్పందిస్తూ..‘‘ భరత్‌ నిరాశపరిచాడని నేను అనను. యువ ఆటగాళ్లు రాణించడానికి సమయం తీసుకుంటారు. ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోచ్‌ కోరుకుంటాడు. అతడి కీపింగ్‌ బాగానే ఉంది. బ్యాట్‌తో కూడా మెరుగ్గా రాణించగలడు’ అని ద్రవిడ్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని