Global chess league: గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ వచ్చేస్తోంది!

ఐపీఎల్‌తో క్రికెట్‌, ప్రొకబడ్డీతో కబడ్డీ ఆటలు మరింత ప్రజాదరణ పొందాయి. ఈ క్రమంలోనే తొలిసారి చెస్‌ లీగ్‌ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది.

Published : 29 May 2023 14:45 IST

న్యూదిల్లీ: ఐపీఎల్‌తో క్రికెట్‌, ప్రొకబడ్డీతో కబడ్డీ ఆటలు మరింత ప్రజాదరణ పొందాయి. ఈ క్రమంలోనే తొలిసారి చెస్‌ లీగ్‌ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. చెస్‌ క్రీడా ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అంతరాలను తొలగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రాండ్‌ మాస్టర్ కోనేరు హంపి అన్నారు. టెక్‌ మహీంద్రా గ్లోబల్‌ చెస్‌ లీగ్‌పేరిట నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. గ్లోబల్ చెస్ లీగ్ మొదటి ఎడిషన్ జూన్‌  21 నుంచి జులై 2, 2023 మధ్య జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో పోటీపడే అగ్రశ్రేణి క్రీడాకారుల్లో హంపీ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘పురుషులు, మహిళలు, జూనియర్ ఆటగాళ్లతో కూడిన మిశ్రమ జట్లతో లీగ్‌ ఉండటం చాలా ఆసక్తికరం. అంతే కాకుండా, టెక్ మహీంద్రా సంస్థ ఈ లీగ్‌ వెనుక ఉండటం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ లీగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్వాహకులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని అన్నారు. టెక్ మహీంద్రా, ఫైడ్ జాయింట్ వెంచర్ అయిన జీసీఎల్ రాపిడ్ చెస్ ఫార్మాట్‌లో డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆరు జట్లు ప్రతి ఒక్కటి కనీసం 10 గేమ్‌లలో పోటీపడతాయి.

చెస్ క్రీడలో మహిళా క్రీడాకారిణులు పెరగాలని ఈ సందర్భంగా హంపి ఆకాంక్షిం చారు. ‘భారత దేశంలో మహిళా చెస్ క్రీడాకారుల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. పురుషుల సర్క్యూట్‌లో చాలా మంది యువకులు ఉన్నారు. కానీ మహిళల చెస్‌లో చాలా తక్కువ మంది ఉన్నారు. మన వద్ద ఉన్న జనాభా, ప్రతిభతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువ. దాని మెరుగుపరచాలి’ అని హంపి పేర్కొన్నారు. మరిన్ని వివరాలను https://globalchessleague.com/ చూడవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని