టీమ్‌ఇండియా అంటే అదే..: కేటీఆర్‌ 

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమ్‌ఇండియా డ్రా చేసుకోవడంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ...

Updated : 12 Jan 2021 10:40 IST

ఈ డ్రా ఇన్నింగ్స్‌ విజయం కన్నా బాగుంది

ఇంటర్నెట్‌డెస్క్‌: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమ్‌ఇండియా డ్రా చేసుకోవడంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ, పట్టుదల, ధైర్యానికి నిదర్శనమని కొనియాడారు. ఒకవైపు ఆటగాళ్లు  గాయాల బారిన పడినా, మరోవైపు జాత్యంహకార వ్యాఖ్యలు ఎదురైనా ఏవీ జట్టు స్ఫూర్తిని దెబ్బతీయలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అద్భుత బ్యాటింగ్‌ చేసిన హనుమ విహారి, అశ్విన్‌ను మెచ్చకున్నారు. అలాగే ఈ డ్రా.. ఇన్నింగ్స్‌ విజయం కన్నా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన విహారి కేటీఆర్‌కు ధన్యవాదాలు చెప్పాడు.

టీమ్‌ఇండియా తొలి టెస్టులో ఘోర పరాభవం ఎదుర్కొని, రెండో టెస్టులో అద్భుత విజయం సాధించి అదే జోరులో సిడ్నీ టెస్టుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడున్నర రోజులు ఆధిపత్యం చెలాయించి దాదాపు మ్యాచ్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నంత పని చేసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం అసాధారణంగా పోరాడిన టీమ్‌ఇండియా మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్‌ఇండియా ఆదివారం 98/2తో నిలిచిన సంగతి తెలిసిందే.

సోమవారం చివరిరోజు రహానె(4) విఫలమైనా పంత్‌(97), పుజారా(77) రాణించారు. అయితే, స్వల్ప వ్యవధిలో వారిద్దరూ ఔటయ్యాక మ్యాచ్‌ చేజారిపోతుందని అంతా భావించారు. కానీ, విహారి(23*; 161 బంతుల్లో 4x4), అశ్విన్‌(39*; 128 బంతుల్లో 7x4) పట్టుదల ప్రదర్శించారు. చివరి వరకూ క్రీజులో ఉన్నారు. 256 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేయడమే కాకుండా ఆసీస్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వారి ఎత్తుగడలకు సంయమనం కోల్పోకుండా ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. దీంతో సిరీస్‌ 1-1తో సమానంగా ఉంది. ఈనెల 15 నుంచి బ్రిస్బేన్‌లో చివరి టెస్టు జరగనుంది.

ఇవీ చదవండి..

గెలుపంత డ్రా

పోరాట యోధులు

‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని