ATP Tournament : సెమీస్‌లోకి బోపన్న - రామ్‌కుమార్‌ జోడీ

అడిలైడ్‌ ఇంటర్నేషనల్ 1 ఏటీపీ టోర్నమెంట్‌లో భారత్‌ శుభారంభం చేసింది. రోహన్‌ బోపన్న - రామ్‌కుమార్ రామనాథన్‌ జోడీ వరుస సెట్లలో విజయం సాధించి ఘనంగా సెమీ ఫైనల్లోకి అడుగు...

Published : 07 Jan 2022 20:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : అడిలైడ్‌ ఇంటర్నేషనల్ 1 ఏటీపీ టోర్నమెంట్‌లో భారత్‌ శుభారంభం చేసింది. రోహన్‌ బోపన్న - రామ్‌కుమార్ రామనాథన్‌ జోడీ వరుస సెట్లలో విజయం సాధించి ఘనంగా సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఏటీపీ 250 మెన్స్‌ డబుల్స్‌ ఈవెంట్లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో.. ఫ్రెంచ్-మొనెగాస్క్‌ ద్వయం బెంజమిన్‌ బొంజి - హ్యూగో నైస్‌లను వరుస సెట్లలో 6-1, 6-3 తేడాతో ఓడించింది. త్వరలో జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో బోస్నియా-మెక్సికన్ జోడీ టొమిస్లోవ్‌ బెరిక్ -‌ శాంటియాగో గొంగాలేజ్‌తో.. బోపన్న జోడీ తలపడనుంది. ఏటీపీ టోర్నీలో ఇద్దరు భారత ఆటగాళ్లు కలిసి ఆటడం ఇదే ప్రథమం.

* సెమీస్‌లో సానియా జోడీ ఓటమి

డబ్ల్యూటీఏ 500 అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో సానియా మీర్జా - నడియా కిచెనోక్‌ జంటకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో స్థానం కోసం శుక్రవారం ఆస్ట్రేలియా జోడీ ఆష్లే బార్టీ - స్టార్మ్‌ సాండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. సానియా ద్వయం 1-6, 6-2, 8-10 తేడాతో ఓటమి పాలైంది. ఒక గంట ఐదు నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో.. ఆఖరికి బార్టీ - స్మార్ట్ జోడీనే విజయం వరించింది. తొలి సెట్‌లో వెనుకబడిన సానియా జోడీ.. రెండో సెట్లో ప్రతిఘటించి పైచేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో విజయం కోసం చివరి వరకు పోరాడినా.. రెండు పాయింట్ల ఆధిక్యంతో బార్టీ జోడీ గెలుపొందింది. జనవరి 17 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సన్నాహకంగా అడిలైడ్‌ టోర్నీని నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని