Sehwag: ధోనీ నన్ను జట్టు నుంచి తొలగించినప్పుడు సచిన్‌ ఏం చేశాడంటే?: వీరేంద్ర సెహ్వాగ్‌

2008లో ఆస్ట్రేలియా పర్యటన సమయంలో అప్పటి భారత కెప్టెన్ ఎం.ఎస్‌. ధోనీ కొన్ని మ్యాచ్‌లకు తనను తప్పించడంతో వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు. అప్పుడు

Published : 02 Jun 2022 01:49 IST

ఇంటర్నెట్ డెస్క్: 2008లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో నాటి భారత కెప్టెన్ ఎం.ఎస్‌. ధోనీ కొన్ని మ్యాచ్‌లకు తనను తప్పించడంతో వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలనుకున్నట్లు భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు. అప్పుడు తాను వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండా సచిన్ తెందూల్కర్ అడ్డుకున్నాడని సెహ్వాగ్ వివరించాడు.

‘‘2008లో మేము ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఆలోచన నా మదిలో మెదిలింది. అప్పటికి టెస్టు సిరీస్‌లో పునరాగమనం చేసి 150 పరుగులు చేశాను. వన్డేల్లో మూడు-నాలుగు ప్రయత్నాల్లో అంత స్కోరు చేయలేకపోయా. కాబట్టి ధోనీ నన్ను తుది జట్టు నుంచి తప్పించాడు. అప్పుడు వన్డే క్రికెట్ నుంచి వైదొలగాలనే ఆలోచన నా మదిలోకి వచ్చింది. టెస్టు క్రికెట్‌లో మాత్రమే ఆడాలనుకున్నాను. ఆ సమయంలో సచిన్ నన్ను అడ్డుకున్నాడు. ‘ఇది నీ జీవితంలో ఒక చెడు దశ. వేచి చూడు. ఈ పర్యటన తర్వాత ఇంటికి వెళ్లి ఏం చేయాలో బాగా ఆలోచించి ఆపై నిర్ణయం తీసుకో’ అని సలహా ఇచ్చాడు. అదృష్టవశాత్తూ నేను ఆ సమయంలో నా రిటైర్మెంట్‌ని ప్రకటించలేదు’’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

‘‘ఆటగాళ్లు రెండు రకాలుగా ఉంటారు. అందులో ఒక రకం సవాళ్లను ఇష్టపడేవారు. వీరు కఠిన పరిస్థితుల్లో సరదాగా ఉంటారు. వీరిలో విరాట్ కోహ్లీ ఒకరు. అతడు అన్ని విమర్శలను వింటాడు. మైదానంలో పరుగులు చేయడం ద్వారా అవి తప్పు అని నిరూపిస్తాడు. మరొక రకం. విమర్శలను పట్టించుకోనివారు. ఎందుకంటే వారికి ఏమి చేయాలో తెలుసు. నేను అలాంటి ఆటగాడినే. నన్ను విమర్శించే వాళ్లను పట్టించుకోను. మంచి పరుగులు సాధించి ఇంటికెళ్లాలని కోరుకుంటా’’ అని వీరూ చెప్పుకొచ్చాడు. 2008లో జరిగిన ట్రై సిరీస్‌లో టీమ్‌ఇండియా మొదటి నాలుగు మ్యాచ్‌లలో సెహ్వాగ్‌ 6, 33, 11, 14 స్కోర్లు మాత్రమే చేసి విఫలమయ్యాడు. దీంతో సెహ్వాగ్‌ని కెప్టెన్‌ ధోనీ తుది జట్టు నుంచి తప్పించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని