Shikhar Dhawan: అప్పుడు భయంతో హెచ్‌ఐవీ టెస్టు చేయించుకున్నా: ధావన్
టీమ్‌ఇండియా ఆటగాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. అలాగే ఫ్యాషన్‌కు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తాడు. శరీరంపై రకరకాల టాటూలు (tattoos) వేయించుకుంటాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. తాను మొదటి టాటూ ఎప్పుడు వేయించుకున్నాడు.. ఆ టాటూ వల్ల ఎదురైన ఇబ్బందులను వెల్లడించాడు. రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే ప్రశ్నకు కూడా సమాధానమిచ్చాడు.
‘నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి మనాలి టూర్‌కు వెళ్లాను. కుటుంబసభ్యులకు తెలియకుండా వీపుపై టాటూ వేయించుకున్నా. ఈ విషయాన్ని దాదాపు 3-4 నెలలు దాచి ఉంచాను. తర్వాత ఒకరోజు మా నాన్నకు టాటూ విషయం తెలిసిపోయింది. ఆయన నన్ను బాగా కొట్టారు. టాటూ వేయించుకున్న తర్వాత నేను చాలా భయపడ్డా. ఎందుకంటే ఆ సూదితో ఎంతమందికి టాటూలు వేశాడో నాకు తెలీదు. దాంతో నేను హెచ్‌ఐవీ టెస్టు చేయించుకున్నాను. అందులో నెగిటివ్ వచ్చింది (నవ్వుతూ)’ అని శిఖర్ ధావన్ చెప్పాడు.
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా.. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని.. భవిష్యత్తులో అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించాడు.‘‘ప్రస్తుతం నా వద్ద అలాంటి ప్రణాళికలు లేవు. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్లాలని రాసిపెట్టుంటే తప్పకుండా వెళ్తాను. నేను ఏ రంగంలో ఉన్న 100 శాతం సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తాను. కచ్చితంగా విజయం సాధిస్తానని తెలుసు. నేను 11 ఏళ్ల నుంచి కష్టపడి పనిచేస్తున్నా. ప్రతి రంగంలోనూ ఇటువంటి సక్సెస్ మంత్ర ఉంటుంది. రాజకీయాల్లో చేరే విషయంపై నేను ఇప్పటివరకూ ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే, దేవుడి సంకల్పం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. నేను రాజకీయాల్లోకి రావాలని దేవుడు సంకల్పిస్తే తప్పకుండా విజయం సాధిస్తాను” అని ధావన్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Parineeti-Raghav : ఒక్కటైన ‘రాగ్నీతి’.. లీలా ప్యాలెస్‌లో వైభవంగా వివాహం
-
Economy: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో భాజపా ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్
-
Tagore Movie: పాటలు వద్దన్న మురగదాస్.. అలా ఛాన్స్ దక్కించుకున్న వినాయక్
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..