SRH vs RR: ఎస్‌ఆర్‌హెచ్ X ఆర్‌ఆర్.. గత చరిత్రను మరిచేలా గెలవాలి..!
ఐపీఎల్ (IPL 2023) సంబరం హైదరాబాద్‌ను తాకింది. ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2023) ప్రస్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) చరిత్ర అద్భుతంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఛాంపియన్‌గా నిలవడంతోపాటు వరుసగా నాలుగేళ్లపాటు ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే, గత రెండు సీజన్లలో ఘోర వైఫల్యంతో విమర్శపాలైంది. పది జట్లు తలపడిన గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు ఏడాది మరీ ఘోరం. చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జట్టులో సమూల మార్పులు చేసి బరిలోకి దిగింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
ఈ సీజన్ తొలి మ్యాచ్ కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. పోలీసు విభాగం కూడా పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే, ఎస్‌ఆర్‌హెచ్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు ఐదెన్ మార్‌క్రమ్ స్థానంలో భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ బాధ్యతలను చేపడతాడు. ఇంగ్లాండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ప్రదర్శనపై హైదరాబాద్ భారీగా ఆశలు పెట్టుకుంది. మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌లో కీలకం. బౌలింగ్ విభాగానికి వస్తే కెప్టెన్ భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, జాన్‌సెన్, నటరాజన్‌లతో పేస్ విభాగం బాగుంది. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌తోపాటు వాషింగ్టన్ సుందర్‌పైనే స్పిన్ భారం ఉంది.
వారిని అడ్డుకుంటే చాలు..
గతేడాది ఆరెంజ్ క్యాప్ విన్నర్ జోస్ బట్లర్‌ను త్వరగా ఔట్ చేయకపోతే హైదరాబాద్ కష్టాలను కొనితెచ్చుకున్నట్లే. సంజూ శాంసన్, దేవదుత్ పడిక్కల్, హెట్మెయర్, రియాన్ పరాగ్ కీలక బ్యాటర్లు. బౌలింగ్‌లోనూ రాజస్థాన్ అద్భుతంగా ఉంది. అశ్విన్, జంపా, చాహల్‌తో కూడిన స్పిన్ దళం ఉన్నప్పటికీ... తుది జట్టులో ఎవరు ఉంటారనేది తెలియాలంటే వేచి చూడాలి. పేస్ బౌలింగ్ అంతా ట్రెంట్ బౌల్ట్, మెకాయ్, సందీప్ శర్మపైనే ఆధారపడి ఉంది. ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ కీలక పాత్ర పోషించడం ఖాయం. తొలిసారి ఐపీఎల్ ఆడుతున్న జో రూట్‌కు అవకాశం దక్కడం కష్టమే. ఇప్పటి వరకు ఇరు జట్లు 16 సార్లు తలపడగా.. చెరో ఎనిమిదిసార్లు విజయం సాధించాయి. గత సీజన్‌లో మాత్రం హైదరాబాద్‌పై రాజస్థాన్ ఘన విజయం సాధించింది.
తుది జట్లు (అంచనా)
హైదరాబాద్: గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
రాజస్థాన్: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదుత్ పడిక్కల్, హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, అశ్విన్, చాహల్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు
-
GVL Narasimha Rao: దసరా లోపు విశాఖ - వారణాసి రైలు: జీవీఎల్
-
Shruti Haasan: ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం.. శ్రుతి హాసన్ ఎమోషనల్ పోస్ట్
-
Delhi Robbery: ₹ 1400 పెట్టుబడితో ₹ 25 కోట్లు కొట్టేద్దామనుకున్నారు
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్