SKY: అతడు.. బౌలర్ల సైకాలజీతో ఆడతాడు: సూర్య శతక ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్లు
గుజరాత్‌పై ‘సూర్య’ (MI vs GT) ప్రతాపం చూపాడు. తన ఐపీఎల్ (IPL) కెరీర్‌లోనే తొలిసెంచరీ నమోదు చేశాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ కేవలం 49 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 103 పరుగులు చేసిన అజేయంగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో (IPL) తొలి సెంచరీ సాధించిన సూర్యకుమార్‌పై (SuryaKumar Yadav) సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముంబయి, గుజరాత్ జట్ల ఆటగాళ్లే కాకుండా మాజీలు సైతం అభినందనలు తెలిపారు. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ పేసర్ జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ సహా క్రికెట్ ప్రముఖులు సూర్య ప్రదర్శనను పొగడ్తలతో ముంచెత్తారు. గత ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు నమోదు చేసిన ముంబయి ఇండియన్స్ జట్టుపై సూర్యకుమార్ ప్రభావం చాలా ఉందని జహీర్ వ్యాఖ్యానించాడు.
‘‘సూర్యకుమార్ ప్రతి మ్యాచ్‌కు మెరుగవుతూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా కీలక సమయాల్లో తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ప్రతి జట్టుకు ఇలాంటి సమయంలో ప్రతి మ్యాచూ చాలా కీలకం. విజయం సాధించడమే అంతిమ లక్ష్యం. ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లాలని అన్ని జట్లూ తీవ్రంగా పోరాడుతున్నాయి. సూర్యకుమార్ ఇలాగే ఆడితే ముంబయి అలవోకగా ప్లేఆఫ్స్‌కు చేరడం ఖాయం. మిగతా జట్లు కూడా ముంబయిని ఇప్పుడు తేలిగ్గా తీసుకోవు. ఎందుకంటే కీలకమైన సూర్యకుమార్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు’’అని జహీర్ ఖాన్ తెలిపాడు.
మైదానం నలువైపులా..: సురేశ్ రైనా
‘‘సూర్యకుమార్ మైదానం నలువైపులా షాట్లు కొడతాడు. ప్రత్యర్థి బౌలర్ సైకాలజీతో ఆడుకుంటాడు. గుజరాత్‌పైనా ఇలాగే నిశ్శబ్దంగా ఆడేశాడు. సూర్య ఆడిన తీరు అద్భుతం. పరుగులు చేయాలనే తపన అపూర్వం. కేవలం 49 బంతుల్లోనే 103 పరుగులు సాధించడం తేలికేంకాదు. ఇన్నింగ్స్‌లో చివరి బంతిని సిక్స్‌గా మలిచి మరీ సెంచరీ పూర్తి చేయడం అభినందనీయం’’ అని రైనా వ్యాఖ్యానించాడు.
సూర్య ఉంటే చాలు: వీరేంద్ర సెహ్వాగ్
‘‘సూర్య ఏదైనా సాధిస్తాడు. అతడు ఎక్కువగా ఫైన్ లెగ్, స్క్వేర్ లెగ్ ఫీల్డర్లతో ఆడతాడు. అతడి బ్యాటింగ్ అమ్ముల పొదిలో స్వీప్ షాట్ కూడా ఉంది. గుజరాత్ స్పిన్ బౌలింగ్ రిథమ్‌ను దెబ్బ కొట్టి మరీ ముంబయిని ఆధిక్యం సాధించేలా చేశాడు’’ అని సెహ్వాగ్ తెలిపాడు.
వాంఖడేలో చాలా కష్టం: యువీ
‘‘రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే, సెంచరీతో సూర్యకుమార్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. వేరే గ్రహం మీద బ్యాటింగ్ చేసినట్లు ఉంది. అద్భుతమైన హిట్టింగ్ చేశాడు. నా మనస్సు కోరుకునే చోట ఇలాంటి సెంచరీ సాధించడం అభినందనీయం. వాంఖడే స్టేడియంలో ఆడటం అంత సులువేం కాదు’’ అని యువీ చెప్పాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
suez canal: సూయిజ్ కాలువలో ఆగిపోయిన చమురు ట్యాంకర్
-
World News
china: తియానన్మెన్ స్క్వేర్ వద్దకు ప్రవేశాలపై ఆంక్షలు
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Crime News
Suicide: నలుగురు పిల్లల్ని చంపేసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
Siddharth: ‘టక్కర్’తో నా కల నెరవేరింది.. ఆయనకు రుణపడి ఉంటా: సిద్ధార్థ్