India vs England: ఇలాంటి థ్రిల్లర్‌ మరెవ్వరి వల్లా కాదు!

క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో టీమ్‌ఇండియా అపూర్వ విజయాన్ని క్రికెట్‌ ప్రపంచం కీర్తిస్తోంది.  క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు కోహ్లీసేనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆటగాళ్లు తిరుగులేని పోరాట పటిమ ప్రదర్శించారని అంటున్నారు....

Updated : 18 Aug 2021 12:27 IST

సచిన్‌, సౌరవ్‌, వీవీఎస్‌, సెహ్వాగ్‌ స్పందనలు ఇవీ!

లండన్‌: క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో టీమ్‌ఇండియా అపూర్వ విజయాన్ని క్రికెట్‌ ప్రపంచం కీర్తిస్తోంది.  క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు కోహ్లీసేనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆటగాళ్లు తిరుగులేని పోరాట పటిమ ప్రదర్శించారని అంటున్నారు. సచిన్‌ తెందూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ సహా అనేక మంది టీమ్‌ఇండియాను పొగిడేస్తున్నారు.

🗨 ఇదో అద్భుతమైన టెస్టు మ్యాచ్‌! మ్యాచ్‌లో ప్రతి సందర్భాన్నీ ఆస్వాదించాను. కఠినమైన పరిస్థితుల్లో వారు తెగువను, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. అద్భుతంగా ఆడారు - సచిన్‌ తెందూల్కర్‌

🗨 టీమ్‌ఇండియా.. అద్భుతమైన విజయం. జట్టులోని ప్రతి ఒక్కరు తిరుగులేని తెగువ, పట్టుదల ప్రదర్శించారు. దగ్గర్నుంచి మిమ్మల్ని చూడటం ఎంతో సంతోషంగా ఉంది - సౌరవ్‌ గంగూలీ

🗨 టెస్టు క్రికెట్లో ఇదో అద్భుతమైన రోజు. ప్రతి భారతీయుడు ఎప్పటికీ గుర్తుంచుకొనే క్రికెట్‌ ఇది. బుమ్రా, షమి ఉదయం బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సిరాజ్‌, ఇషాంత్‌, బుమ్రా, షమి బంతితో తమ పవర్‌ చూపించారు. లార్డ్స్‌లో టీమ్‌ఇండియా సంచలన విజయం సాధించింది - వీవీఎస్‌ లక్ష్మణ్‌

🗨 గట్టెక్కితే చాలనుకున్న స్థితి నుంచి గెలుపు వైపు పయనించారు. లార్డ్స్‌లో ఆఖరి రోజు ఒక థ్రిల్లర్‌ను తలపించింది. టీమ్‌ఇండియాకు ఇది గొప్ప విజయం. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను భవిష్యత్తులో పదేపదే చూస్తారు - దినేశ్‌ కార్తీక్‌

🗨 లార్డ్స్‌లో అద్భుతమైన టెస్టు మ్యాచ్‌. గొప్ప పిచ్‌పై టీమ్‌ఇండియా గొప్పగా క్రికెట్‌ ఆడింది. పట్టుదల ప్రదర్శించింది. వారు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేశారని గుర్తుంచుకోవాలి. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయారు. పంత్‌ ఔటవ్వగానే ఇంగ్లాండ్‌ గెలిచిందనుకున్నారు! కానీ టీమ్‌ఇండియా గొప్పగా ఆడింది. వారు ఈ విజయానికి అర్హులు. భారత్‌ 2-0తో గెలుస్తుంది! - షేన్‌ వార్న్‌

🗨 ఇదో అద్భుతమైన క్రికెట్‌.. ఇంగ్లాండ్‌ కన్నా తామెంతో మెరుగైన జట్టని టీమ్‌ఇండియా నిరూపించుకుంది. వారి గెలవాలన్న తపన మాత్రం ఊహించలేనిది - మైకేల్‌ వాన్‌

🗨 ఆఖరి రోజు ఆరంభంలో బతకగలమా అన్న పరిస్థితి! అలాంటిది లార్డ్స్‌లో విజయం సాధించేశారు. విదేశాల్లో టెస్టు మ్యాచుల్లో మనలా పుంజుకోవడం చాలా దేశాలకు కష్టం. కుర్రాళ్లు అద్భుతమే చేశారు. అందరూ అన్నట్టుగానే.. భారతీయులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు - వీరేంద్ర సెహ్వాగ్‌









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని