Harshal  Patel Hat-trick: సెలెక్షన్‌ నా చేతుల్లో లేదు: హర్షల్‌

టీ20 ప్రపంచకప్‌కు తాను ఎంపికవకపోవడం నిరాశ కలిగించలేదని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ అన్నాడు.

Published : 28 Sep 2021 10:48 IST

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌కు తాను ఎంపికవకపోవడం నిరాశ కలిగించలేదని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ అన్నాడు. సెలెక్షన్‌ తన చేతుల్లో లేదని తెలిపాడు. ‘‘నేనెప్పుడూ నిరాశకు లోనవను. జీవితంలో నా నిర్ణయాలన్నీ వ్యక్తిగత సామర్థ్యం మేరకు తీసుకున్నవే. సెలెక్షన్‌ విషయానికొస్తే అది నా చేతుల్లో లేదు. ఐపీఎల్, టీమ్‌ఇండియా, హరియానా ఇలా ఏ జట్టుకు ఆడినా బ్యాటు లేదా బంతితో సానుకూల ప్రభావం చూపాలన్నదే నా ఏకైక లక్ష్యం. క్రికెట్‌ ఆడినంత కాలం నా లక్ష్యం అదే. నా జీవితంలో హ్యాట్రిక్‌ సాధించడం ఇదే మొదటి సారి. పాఠశాల స్థాయిలో కూడా హ్యాట్రిక్‌ సాధించలేదు. ఐపీఎల్‌లో ఆరు సార్లు   హ్యాట్రిక్‌కు దగ్గరగా వచ్చా. ఎట్టకేలకు ఆదివారం ముంబయి ఇండియన్స్‌పై హ్యాట్రిక్‌ లభించింది’’ అని హర్షల్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని