IPL 2021: ఐపీఎల్‌తో దక్షిణాఫ్రికాకు లాభమా?.. మార్క్‌బౌచర్‌ చెబుతున్నదేంటి?

మరికొద్ది రోజుల్లో యూఏఈలో తిరిగి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆడటం వల్ల తమకు కలిసి వస్తుందని ఆ జట్టు హెడ్‌కోచ్‌ మార్క్‌బౌచర్‌ అన్నాడు...

Published : 15 Sep 2021 19:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది రోజుల్లో యూఏఈలో తిరిగి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆడటం వల్ల తమకు కలిసి వస్తుందని ఆ జట్టు హెడ్‌కోచ్‌ మార్క్‌బౌచర్‌ అన్నాడు. మంగళవారం ఆ జట్టు శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన అనంతరం అతడీ వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటం వల్ల అది టీ20 ప్రపంచకప్‌లో ఉపయోగపడుతుందని చెప్పాడు. ఐపీఎల్‌ కోసం తమ ఆటగాళ్లు యూఏకి వెళ్లకముందే వారితో మాట్లాడామని, అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవడం మంచిదని బౌచర్‌ పేర్కొన్నాడు.

‘ఐపీఎల్‌లో ఆడటం వల్ల యూఏఈలోని పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి తెలుస్తుంది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో ఎలా ఆడాలనే అవగాహన పెరుగుతుంది. అక్కడి పరిస్థితులను సరిగ్గా వినియోగించుకొని, నెట్స్‌లో మంచి సాధన చేస్తే దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌లో మెరుగైన స్థితిలో ఉంటుంది. ఈ విషయాలన్నింటిపై మేం చాలా లోతుగా చర్చించాం. ఒక జట్టుగా గతంలో చేసిన తప్పుల నుంచి ఏం నేర్చుకున్నామో, ఇకపై ఎలా ఆడాలనే విషయాలపైనా మాట్లాడుకున్నాం. ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌ ముఖ్యమని మాకు తెలుసు. ఇప్పటికైతే టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచాం. దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఇది కేవలం మా జట్టు మెరుగవడానికి నిదర్శనం మాత్రమే’ అని ప్రోటియాస్‌ కోచ్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని