
IND vs NZ : నేనెప్పుడూ దాని గురించే ఆలోచిస్తా: రోహిత్
ఇంటర్నెట్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై సెమీస్ ఆశలను గల్లంతు చేసుకున్న టీమ్‌ఇండియా ఇప్పుడు అదే జట్టుపై 3-0 తేడాతో గెలుపొంది సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అదరగొట్టాడు. అయితే, ఈ విజయంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారని రోహిత్ చెప్పాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హిట్‌మ్యాన్ సరైన శుభారంభం చేయడం ముఖ్యమని తెలిపాడు. ఎప్పుడూ అదే తన ఆలోచనా విధానమని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు ఒకసారి పిచ్‌ను పరిశీలిస్తే ఏం చేయాలనే విషయంపై స్పష్టత వస్తుందన్నాడు.
‘ఈరోజు మ్యాచ్‌లో మంచు ప్రభావం అధికంగా ఉండటంతో బంతి.. బ్యాట్‌పైకి బాగా వచ్చింది. మా బ్యాటింగ్ బృందం ఎలా ఆడాలనేదానిపై ముందే ప్రణాళికలు వేసుకున్నాం. అయితే, అది బాగా ఉపయోగపడిందని నేను అనుకోను. మిడిల్ ఆర్డర్‌లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. కేఎల్ రాహుల్ ఈరోజు ఆడకపోయినా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు మిడిల్ ఆర్డర్‌కు ఈరోజు మినహా పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సిరీస్ మొత్తంలో మా స్పిన్నర్లు బాగా రాణించారు. అశ్విన్, అక్షర్ బౌలింగ్ చేసిన తీరు బాగుంది. చాహల్ లయ అందుకున్నాడు. వెంకటేశ్ సైతం తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు’ అని రోహిత్ వివరించాడు.
అలాగే ఇతర జట్లలోని ఆటగాళ్లు 8, 9 స్థానాల వరకూ బాగా ఆడుతున్నారని కెప్టెన్ గుర్తుచేశాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాలోనూ ప్రతి ఒక్కరు రాణించాలన్నాడు. హర్షల్ పటేల్ హరియాణా జట్టు తరఫున ఆడేటప్పుడు ఓపెనింగ్ చేస్తాడని, అలాగే దీపక్ చాహర్ శ్రీలంక పర్యటనలో ఎలా బ్యాటింగ్ చేశాడో మనం చూశామన్నాడు. యుజువేంద్ర చాహల్ సైతం బ్యాటింగ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని రోహిత్ తెలిపాడు. ఇక చివరగా తన పుల్‌షాట్‌పై స్పందించిన హిట్‌మ్యాన్.. ఆ షాట్ సహజంగా రాదని, దానికోసం ఎంతో సాధన చేశానని స్పష్టం చేశాడు. ఒక్కోసారి ఆ షాట్ బాగా పడుతుందని, ఒక్కోసారి కుదరదని తెలిపాడు. అందువల్లే కొన్నిసార్లు తాను ఆ షాట్ ఆడబోయి ఔటౌతానని వివరించాడు. కాబట్టి, ఎవరికైనా మంచి నైపుణ్యం ఉంటే దానిపై దృష్టిసారించాలని సూచించాడు.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.