Virat Kohli: ఈ సిరీస్‌ మొత్తం మేం 4-1 కాంబినేషన్‌ పాటిస్తాం: కోహ్లీ

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా మిగతా మ్యాచ్‌ల్లోనూ 4-1 కాంబినేషన్‌ పాటిస్తుందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. తొలి టెస్టు రద్దు అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన అతడు ప్రతి మ్యాచ్‌లోనూ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్‌ను తీసుకుంటామని చెప్పాడు. అదే

Published : 09 Aug 2021 01:07 IST

నాటింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా మిగతా మ్యాచ్‌ల్లోనూ 4-1 కాంబినేషన్‌ పాటిస్తుందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. తొలి టెస్టు రద్దు అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన అతడు ప్రతి మ్యాచ్‌లోనూ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్‌ను తీసుకుంటామని చెప్పాడు. అదే నిజమైతే ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. 

‘ఈ మ్యాచ్‌లో వర్షం మూడు, నాలుగు రోజుల్లో పడుతుందని మేం ఆశించాం. కానీ, అది ఐదో రోజున పడింది. చివరి రోజు ఆట జరిగి ఉంటే ఎంతో బాగుండేది. అయితే, అదలా జరగలేదు. బాధగా ఉంది. అలాగే మేం మ్యాచ్‌లో బలమైన ఓపెనింగ్‌ చేయాలనే అనుకున్నాం. దాంతో ఐదోరోజు మాకు విజయావకాశాలు ఉంటాయని భావించాం. ఈ క్రమంలోనే నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి మ్యాచ్‌పై పట్టు సాధించామని అనుకున్నాం. మరోవైపు మేం తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యం అలా సాధిస్తామని అనుకున్నాం. కానీ, అది 95 పరుగులకు చేరింది. ఆ లీడ్‌ మాకెంతో కీలకమైనా చివరి రోజు ఆట తుడిచిపెట్టుకుపోవడం  బాధాకరం’ అని కోహ్లీ విచారం వ్యక్తం చేశాడు.

చివరి రోజు టీమ్‌ఇండియా విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 303 పరుగులకు ఆలౌటవ్వడంతో భారత్‌ లక్ష్యం 209 పరుగులుగా నమోదైంది. నాలుగో రోజు మూడో సెషన్‌లో ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా శనివారం ఆట నిలిచిపోయేసరికి 52/1తో నిలిచింది. రాహుల్‌(26) ఔటైనా రోహిత్‌ (12), పుజారా(12) నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలోనే చివరి రోజు భారత్‌ మరో 157 పరుగులు చేయాల్సి ఉంది. కానీ వర్షం అంతరాయం కలిగించడంతో ఆదివారం ఒక్క బంతి పడకుండానే ఆట రద్దయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని