SKY : పది మిలియన్‌ బంతులను చూశా.. కానీ అలాంటి షాట్‌ చూడలేదు : సూర్య సిక్స్‌పై ప్రశంసలు

ఎవరికీ సాధ్యం కాని ఓ షాట్‌ను సూర్య కుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) అలవోకగా కొట్టడంపై మాజీ దిగ్గజాలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

Updated : 13 May 2023 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : వాంఖడే మైదానంలో ‘సూర్య’ ప్రతాపంపైనే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. అతడు ఆడిన షాట్లను వర్ణించడానికి క్రికెట్‌ పండితులకూ మాటలు రావడం లేదు. అంతలా విధ్వంసం సృష్టించాడు ఈ మిస్టర్‌ 360. గుజరాత్‌ టైటాన్స్‌(MI vs GT)పై సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) 49 బంతుల్లో 103 పరుగులు చేశాడు.

సూర్య తన ఇన్నింగ్స్‌లో మొత్తం 6 సిక్స్‌లు బాదగా.. అందులో థర్డ్‌ మ్యాన్‌ దిశగా కొట్టిన ఓ షాట్‌ అద్భుతం. క్రికెట్‌ దిగ్గజాలు కూడా ఈ షాట్‌ ఎలా సాధ్యం అంటూ.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ(Tom Moody) కూడా దీనిపై స్పందించాడు.

సూర్య బ్యాట్‌ను కత్తిలా వాడి బంతిని కోస్తున్నట్లుగా కొట్టిన ఓ షాట్‌కు థర్డ్‌ మ్యాన్‌లో బంతి బౌండరీ దాటింది. తన జీవితంలో ఎన్నో షాట్లను చూశాను గానీ.. ఇలాంటి షాట్‌ను చూడలేదని మూడీ వర్ణించాడు. ‘థర్డ్‌ మ్యాన్‌ దిశగా వర్టికల్‌గా సిక్స్‌ కొట్టడం నేనెప్పుడూ చూడలేదు. హారిజాంటల్‌గా కొట్టడం చూశాను. అన్ని ఫార్మాట్లలో నా జీవిత కాలంలో దాదాపు 10 మిలియన్‌ బంతులను చూసుంటాను. కానీ.. ఇలాంటి షాట్‌ చూడలేదు. అలాంటి షాట్‌ను ఇంకెవ్వరూ కొట్టలేరు. అతడికి మాత్రమే సాధ్యం’ అంటూ మూడీ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ విశ్లేషించాడు. ఇక ఈ షాట్‌ను చూసి ముంబయి మెంటార్‌ సచిన్‌ తెందూల్కర్‌ కూడా ఆశ్చర్యపోయిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని