Virat Kohli: నార్వే డ్యాన్సర్లతో విరాట్ అదిరిపోయే స్టెప్పులు
బ్యాట్‌తో బౌండరీలు బాదడమే కాదు అదిరిపోయే స్టెప్పులూ వేయగలనని నిరూపిస్తున్నాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్‌కోహ్లి..
ఇంటర్నెట్ డెస్క్: బ్యాట్‌తో బౌండరీలు బాదడమే కాదు అదిరిపోయే స్టెప్పులూ వేయగలనని నిరూపిస్తున్నాడు స్టార్ బ్యాటర్ విరాట్‌కోహ్లి. నార్వేకు చెందిన అబ్బాయిల డాన్స్ గ్రూప్ ‘క్విక్‌స్టైల్’తో కలిసి డాన్స్ చేశాడు. బ్యాట్ పట్టుకుని అతడు చేసిన మూవ్స్ ప్రస్తుతం నెట్టింటిని హల్‌చల్ చేస్తున్నాయి. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ముగిశాక అతడు ఈ విధంగా ఉత్సాహంగా గడపడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. క్విక్‌స్టైల్(QS) బృందంలో ఓ వ్యక్తి క్రికెట్ బ్యాట్‌ని ఎత్తి ఏం చేయాలో ఆలోచిస్తుండగా వీడియో ప్రారంభమవుతుంది. తెల్లరంగు టీషర్ట్, నల్ల ప్యాంటు ధరించి సీన్‌లోకి వస్తాడు విరాట్. ఆ సమయంలో మ్యూజిక్ వస్తుంది. ఇష్క్, స్టిరియో నేషన్స్ పాటలకు బ్యాట్ పట్టుకుని మ్యూజిక్‌కు తగినట్టుగా డాన్స్ చేస్తాడు. బృంద సభ్యులు అతడిని అనుసరిస్తూ స్టెప్పులేస్తారు. ఈ వీడియోను విరాట్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు. వీడియోను పోస్ట్ చేసిన గంటలోనే 5.4 లక్షల లైకులు, 2 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. దీనిపై కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందించి ఫయర్ ఎమోజీలను పోస్టు చేసింది. దీనిపై అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘76వ సెంచరీ సంబరాలు బయటికి వచ్చాయని ఓ యూజర్ కామెంట్ చేశాడు. కొందరేమో అతడి డాన్స్ మూవ్‌లకు ఫిదా అవుతున్నారు. ‘విరాట్ వారికి క్రికెట్ నేర్పిస్తే వారు అతడికి డాన్స్ నేర్పిస్తున్నారు. ఇదేదో బాగుంది కదూ?’ అంటూ ఓ వ్యక్తి , బాలీవుడ్ నటుల కంటే గొప్పగా డాన్స్ చేశారని మరో వ్యక్తి కామెంట్లు చేశారు. భారత పర్యటనలో ఉన్న ఈ బృందం భారతీయ పాటలకు వేసిన స్టెప్పుల ద్వారా ప్రేక్షకులకు చేరువైంది. తను వెడ్స్ మను సినిమా నుంచి సద్దీ గల్లీ, బార్ బార్ దేఖో నుంచి కాలా చశమా పాటలకు వేసిన స్టెప్పులతో సామాజిక మాధ్యమాల్లో ఒక సంచలనంగా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ధోనీకి కెప్టెన్‌గా కొంచెం కష్టపడ్డా: స్టీవ్ స్మిత్
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా
-
India News
Karnataka: కోలార్ నుంచీ పోటీ చేస్తా: సిద్ధరామయ్య ప్రకటన
-
Movies News
Dasara: ‘బాహుబలి’.. ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ‘దసరా’!
-
Sports News
David Warner: ‘డేవిడ్ వార్నర్‌ను వదిలేసి సన్‌రైజర్స్ పెద్ద తప్పు చేసింది’
-
Politics News
Karnataka polls: హంగ్‌కు ఛాన్స్‌లేదు.. ఎవరితోనూ పొత్తులుండవ్..: డీకేఎస్