Virat Kohli Fangirl : ‘కోహ్లీ అంటేనే ఇష్టం’.. పాక్‌లో విరాట్ ఫ్యాన్‌గర్ల్ వీడియో వైరల్
విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. పాకిస్థాన్‌లోనూ అతడిపై ప్రేమను చూపిస్తుంటారు. తాజాగా పాక్‌కు చెందిన ఓ ఫ్యాన్‌గర్ల్ వీడియో వైరలవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పరుగుల వీరుడు కింగ్ కోహ్లీ(Virat Kohli)కి దాయాది పాకిస్థాన్‌లోనూ అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అక్కడి యువ క్రికెటర్లూ విరాట్‌ను ఆరాదిస్తారు. అతడి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు. అయితే.. శనివారం ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచ్ (IND vs PAK) వర్షం కారణంగా అభిమానులను నిరాశపరిచినా.. ఓ ఫ్యాన్‌గర్ల్(Virat Kohli Fangirl) విరాట్‌పై తన ప్రేమను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆ వీడియోలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్(Babar Azam), విరాట్ కోహ్లీలో మీకు ఎవరు ఇష్టం అని అడగ్గా.. తనకిష్టమైన ఆటగాడు విరాటే అని ఆ యువతి చెప్పడం విశేషం. కోహ్లీ ఆట చూసేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు పేర్కొంది. మీరు ఏ జట్టుకు మద్దతిస్తారు..? అని అడగ్గా.. ‘నేను పాకిస్థాన్‌కూ మద్దతిస్తాను అని చెబుతూ.. ఇది ఇండియా, ఇది పాకిస్థాన్ అంటూ తన చెంపలపై ఓ వైపు పాకిస్థాన్.. మరోవైపు భారత్ జాతీయ జెండా రంగులను చూపించింది. ‘పొరుగువారిని ప్రేమించడం చెడ్డ విషయమేమీ కాదు కదా..?’ అంటూ ఆమె చివర్లో పేర్కొనడం అందరినీ ఆకట్టుకుంటోంది.
మరోవైపు పాక్‌లోని బలూచిస్థాన్ (Balochistan)కు చెందిన కొంతమంది ఫ్యాన్స్ కోహ్లీపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఇసుకతో విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీశారు. అనంతరం ఆ భారీ చిత్రాన్ని డ్రోన్‌తో చిత్రీకరించారు. దీంతో కోహ్లీకి పాక్‌లో ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ఈ ఘటనలు వెల్లడిస్తున్నాయి.
ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్ రద్దు కాగా.. భారత్ నేడు ఆసియా(Asia Cup 2023) కప్‌లో నేపాల్‌తో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: అభివృద్ధిపై వాళ్లకు విజన్, రోడ్‌మ్యాప్ లేవు.. విపక్షాలపై మోదీ ఫైర్
-
Rajinikanth: రజనీకాంత్ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్.. ఎవరెవరంటే?
-
Vande Bharat Train: ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
-
Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్
-
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
-
New Words: ఫిన్స్టా.. గర్ల్‌బాస్.. షెఫ్స్ కిస్.. ‘జెనరేషన్ జడ్’ సరికొత్త పదాలు డిక్షనరీలోకి!