హెచ్‌పీ సరికొత్త ల్యాప్‌టాప్‌

ప్రస్తుత ప్రొఫెషనల్‌ గేమర్స్‌కు మంచి టెక్నాలజీ, శక్తిమంతమైన గ్రాఫిక్స్‌తో కూడిన సమర్థమైన పరికరం అత్యవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని హెచ్‌పీ సంస్థ ఓమెన్‌ 17 పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది.

Published : 08 Mar 2023 00:42 IST

ప్రస్తుత ప్రొఫెషనల్‌ గేమర్స్‌కు మంచి టెక్నాలజీ, శక్తిమంతమైన గ్రాఫిక్స్‌తో కూడిన సమర్థమైన పరికరం అత్యవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని హెచ్‌పీ సంస్థ ఓమెన్‌ 17 పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. 13వ జెన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ9 ప్రాసెసర్‌తో కూడిన  ఇది ఎన్‌విడియా జీఫోర్స్‌ ఆర్‌టీఎక్స్‌ 4080 జీపీయూ కలిగుంది. క్యూహెచ్‌డీ (2కే) వరకు రెజల్యూషన్‌ గల 17.3 అంగుళాల డిస్‌ప్లే, 240హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ వేగం దీని సొంతం. ఓమెన్‌ టెంపెస్ట్‌ కూలింగ్‌ టెక్నాలజీ సాయంతో ఇది డెస్క్‌టాప్‌ స్థాయిలో గేమింగ్‌ అనుభూతిని కలిగిస్తుంది. ఏ గేమ్‌నైనా లాంచ్‌ చేయటానికి, ఆర్గనైజ్‌ చేయటానికి తోడ్పడే ఓమెన్‌ గేమింగ్‌ హబ్‌తోనూ కూడుకొని ఉంటుంది. ఇది గేమర్లను మిగతావారికన్నా మరింత ముందుండేలా చేస్తుంది. అధునాతన ఆర్‌టీఎక్స్‌ జీపీయూ కలిగుండటం వల్ల డీఎల్‌ఎస్‌ఎస్‌ 3 (ఏఐ ఆధారిత అప్‌స్కేలింగ్‌) వంటి పరిజ్ఞానాలనూ సపోర్టు చేస్తుంది. గత ఎన్‌విడియా ల్యాప్‌టాప్‌ జీపీయూలతో పోలిస్తే మరింత సమర్థంగా పనిచేస్తుంది. బ్యాటరీనీ తక్కువ వాడుకుంటుంది. వైఫై 6ఈ కనెక్టివిటీ ఉండటం వల్ల చాలా వేగంగా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. డ్యుయల్‌ బ్యాంగ్‌ ఫిటింగ్‌, ఓలుఫ్‌సెన్‌ స్పీకర్‌ వ్యవస్థల వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. టెంపోరల్‌ నాయిస్‌ రిడక్షన్‌ సపోర్టుతో కూడిన 720పీ వెబ్‌ కెమెరా కూడా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు