Published : 03 Dec 2021 22:55 IST

WhatsApp Emoji: వాట్సాప్ ఎమోజీలకు కొత్త హంగులు

ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్స్‌కు మెరుగైన సేవలు అందించడంలో వాట్సాప్ ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూజర్స్‌ ఉపయోగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వాట్సాప్ యూజర్స్‌ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా యూజర్స్‌కు జంట (Couple) ఎమోజీలు వేర్వేరు రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా యూజర్స్‌కు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. త్వరలో పూర్తిస్థాయి యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. 

మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఎమోజీలతో చెప్పొచ్చు. టైప్‌ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్క క్లిక్‌తో మన మూడ్‌ను అవతలి వారికి తెలియజేయొచ్చు. అందుకే చాట్ సంభాషణల్లో ఎమోజీలు కీలకంగా మారాయి. కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌తో యూజర్‌ జంట ఎమోజీపై క్లిక్ చేసినప్పుడు వివిధ రకాల స్కిన్‌టోన్‌తో కనిపిస్తాయి. వాటిలో మనకు నచ్చిన రంగు ఎమోజీని పంపొచ్చు. ఇటీవలే వాట్సాప్‌ స్టిక్కర్స్, ఎమోజీలకు సంబంధించి మెసేజ్ రియాక్షన్‌ ఫీచర్‌, గ్రూపు ఐకాన్‌లుగా ఎమోజీలు పెట్టుకునే ఫీచర్లను పరిచయం చేసింది. అలానే వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన 2.21.24.11 వెర్షన్ అప్‌డేట్‌తో కొంతమంది యూజర్స్ తమ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడంలేదనే ఫిర్యాదు చేశారు. దీంతో వాట్సాప్ దీనిని మరో కొత్త వెర్షన్‌ అప్‌డేట్‌ను తీసుకురానుందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని