సింగరేణిలో సమ్మె గంట

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలు మూడు రోజులపాటు సమ్మె చేయనున్నారు. సింగరేణిలో 23 భూగర్భ, 19 ఉపరితల గనులున్నాయి

Published : 09 Dec 2021 05:06 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలు మూడు రోజులపాటు సమ్మె చేయనున్నారు. సింగరేణిలో 23 భూగర్భ, 19 ఉపరితల గనులున్నాయి. 42 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాకు-3, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్లాకు-3, మంచిర్యాల జిల్లాలోని కళ్యాణఖని-6, ఆసిఫాబాద్‌ జిల్లాలోని శ్రావణపల్లి బ్లాకులకు సింగరేణి సంస్థ రూ.167 కోట్లు ఖర్చు చేసింది. అన్వేషణతో పాటు ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకుంది. బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆ నాలుగు బ్లాకులకు కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటన ఇచ్చింది. దీంతో ప్రైవేటు సంస్థలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 3, 6 తేదీల్లో సింగరేణి యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో గురువారం ఉదయం షిఫ్టు నుంచి 72 గంటల సమ్మెలోకి దిగేందుకు కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని