TS News: కరోనా ఆంక్షలు 20 వరకు పొడిగింపు

కరోనా కేసుల వృద్ధి నేపథ్యంలో తెలంగాణలో వాటి నియంత్రణకు విపత్తు నిర్వహణ చట్టం కింద విధించిన ఆంక్షలను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు (జీవో నెం.6) జారీ చేసింది. గత నెల 25

Updated : 10 Jan 2022 08:46 IST

సభలు, ర్యాలీలపై నిషేధం  

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కేసుల వృద్ధి నేపథ్యంలో తెలంగాణలో వాటి నియంత్రణకు విపత్తు నిర్వహణ చట్టం కింద విధించిన ఆంక్షలను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు (జీవో నెం.6) జారీ చేసింది. గత నెల 25 నుంచి ఈ నెల పదోతేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తాజాగా వాటిని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాలీలు, బహిరంగ సభలు, మతపరమైన వాటితో పాటు, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించింది. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్‌, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరు విధిగా మాస్క్‌ ధరించాలంది. వ్యక్తిగత దూరం పాటించాలని, ఆవరణలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని, ప్రవేశద్వారాల వద్ద చేతుల పరిశుభ్రత, థర్మల్‌ స్క్రీనింగు ద్వారా శరీర ఉష్ణోగ్రతల తనిఖీ తదితర జాగ్రత్తలు తీసుకున్నాకే లోనికి అనుమతించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి తప్పక జరిమానా విధించాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని