
పెట్రో ధరల తగ్గింపు
పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకంలో కోత
లీటర్‌కు వరుసగా రూ.8, రూ.6 చొప్పున ఉపశమనం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవాలని పిలుపు
ఉజ్వల్ లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై రూ.200 రాయితీ
ప్లాస్టిక్, ఉక్కు ముడి సరకులపైనా కస్టమ్స్ సుంకం తగ్గింపు
హైదరాబాద్‌లో పెట్రోలు రూ. 10.91 డీజిల్ రూ. 7.64 మేర ఊరట
ఈనాడు, దిల్లీ: అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ఉపశమనపు జల్లును కురిపించింది. నిత్యావసరాల పెంపునకు, తద్వారా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కళ్లెం వేసింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం సాయంత్రం ట్విటర్ ద్వారా ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్‌కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వస్తుందని తెలిపారు. ఎక్సైజ్ సుంకంలో కోత నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోనుందని పేర్కొన్నారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించాలని ఆమె సూచించారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ ప్రకటించారు. ప్లాస్టిక్, ఉక్కు ఉత్పత్తులకు అవసర ముడిసరకులు, ఉపకరణాలపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. సిమెంటు లభ్యత పెంచడంతో పాటు దాని ధర తగ్గింపునకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఏడు నెలల్లో రెండోసారి
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎన్నడూలేని స్థాయికి చేరడంతో దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతూ వస్తోంది. దానివల్ల టోకు ద్రవ్యోల్బణం 15.08శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం 7.79%కి చేరి ఎనిమిదేళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సిమెంటు, స్టీల్ ధరలు పెరిగి గృహనిర్మాణంపై తీవ్రప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉపాధి కల్పన పడిపోతుండడంతో కేంద్రం దిద్దుబాటుకు దిగింది.
* గత ఏడాది నవంబరులో కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇప్పుడు రూ.8, రూ.6 చొప్పున కోత వేసింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.19.9, డీజిల్‌పై రూ.15.8 చొప్పున ఎక్సైజ్ సుంకం అమల్లో ఉంటుంది.
* 2020లో గరిష్ఠంగా లీటర్ పెట్రోల్‌పై రూ.32.9, డీజిల్‌పై రూ.31.8 ఎక్సైజ్ సుంకం అమల్లో ఉండేది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ రూ.13., డీజిల్‌పై రూ.16 తగ్గించినట్లయింది.
* కేంద్రం తాజా పిలుపునకు కేరళ సర్కారు వెంటనే స్పందించింది. తమ రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌పై విధిస్తున్న పన్నులో రూ.2.41, డీజిల్‌పై పన్నులో రూ.1.36 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
కష్టకాలంలోనూ సంక్షేమ పథం: నిర్మల
మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.‘‘ప్రధాని మోదీ హామీల దృష్ట్యా పేదలను ఆదుకోవడానికి మరికొన్ని చర్యలు ప్రకటిస్తున్నాం. ఇందులో భాగమే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు. దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి. ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ ఇస్తాం. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.6,100 కోట్ల భారం పడుతుంది’’ అని నిర్మలాసీతారామన్ తెలిపారు.
కంటి తుడుపు చర్యే: కాంగ్రెస్
ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన పెట్రో ధరల తగ్గింపు కంటి తుడుపు చర్య మాత్రమేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా విమర్శించారు. ‘గత 60 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.10 పెంచి రూ.9.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. డీజిల్ ధర విషయంలోనూ 60 రోజుల్లో రూ.10 పెంచి ఇప్పుడు రూ.7 తగ్గిస్తున్నట్లు చెప్పారు. 2014 మే స్థాయికి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించండి’’ అని డిమాండ్ చేశారు.
బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే రాష్ట్రాలకు
కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పేరుతో భారీగా వసూలు చేస్తున్నా, పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు తిరిగిచ్చేది మాత్రం స్పల్పంగా ఉంటోంది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గించడంతో వాటిపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ వరుసగా రూ.19.90, రూ.15.80కి తగ్గిపోయింది. వాస్తవంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటా ప్రకారం ఇందులో 41% రాష్ట్రాలకు రావాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్సైజ్ డ్యూటీని బేసిక్, స్పెషల్ అడిషినల్, అడిషినల్ ఎక్సైజ్‌డ్యూటీల పేరుతో మూడు వేర్వేరు విభాగాల కింద విభజించింది. ఇందులో పెట్రోల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కింద లీటర్‌కు రూ.1.40, డీజిల్‌పై రూ.1.80 వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని మాత్రమే పన్ను వాటా కింద రాష్ట్రాలకు పంచుతోంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు పెట్రోలియం ఉత్పత్తులపై విధించే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నామని, ప్రస్తుతం ఇది పెట్రోల్‌పై రూ.1.40, డీజిల్‌పై రూ.1.80 మాత్రమే ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,71,908 కోట్లు వచ్చినా అందులో రాష్ట్రాలకు రూ.19,972 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. అంటే మొత్తం వసూలైన సుంకాల్లో రాష్ట్రాలకు దక్కింది 5.37% మాత్రమే. ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగనుంది.
రాష్ట్రంలో 13 లక్షల మంది ‘ఉజ్వల్’ లబ్ధిదారులకు సాంత్వన
ఈనాడు, హైదరాబాద్: పెట్రోలు, డీజిల్‌పై కేంద్రప్రభుత్వం పెద్దమొత్తంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో వినియోగదారులకు భారీగా ఊరట లభించనుంది. తెలంగాణలో లీటరు పెట్రోలుపై రూ.10.91, డీజిల్‌పై 8 రూపాయలకు పైగా తగ్గుతుందని సమాచారం. రాష్ట్రంలో పెట్రోలుపై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. పెట్రోలు, డీజిల్‌పై కలిపి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరుకు రూ.4.50కు పైగా తగ్గుతుందని అంచనా. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన వినియోగదారులకు గ్యాస్ సిలిండరు ధరపై కేంద్రం రూ.200 రాయితీ ఇచ్చింది. ఈ తగ్గింపుతో రాష్ట్రంలో సుమారు 13 లక్షల మంది వినియోగదారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం గ్యాస్ ధర రూ.1,055 ఉండగా ఆదివారం నుంచి రూ.855కు తగ్గుతుంది.
ప్రజల కోసమే..
మాకు అన్నింటి కంటే ప్రజలే ముఖ్యం. ఈ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయి. విభిన్న రంగాలపై అది సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఉపశమనం కల్గించి, జీవనాన్ని మరింత సులభంగా మారుస్తుంది. ఉజ్వల పథకం కోట్ల మంది ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మేలు చేసింది. ఉజ్వల గ్యాస్ రాయితీపైౖ తీసుకున్న నిర్ణయం కుటుంబాల బడ్జెట్‌ను సరళతరం చేస్తుంది
- ట్విటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
India News
Kerala: సీఎం పినరయ్ విజయన్ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
-
Movies News
Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’కు.. ఆనంద్ మహీంద్రా రియాక్ట్!
- Social Look: ఆహారం కోసం ప్రియాంక ఎదురుచూపులు.. రకుల్‌ప్రీత్ హాట్ స్టిల్!
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
- IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్‌లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం