మెడికల్‌ అన్‌ఫిట్‌ విభాగంలో... కుటుంబ సభ్యులకు ఉద్యోగం

వైద్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. మెడికల్‌ అన్‌ఫిట్‌ విభాగంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి కుటుంబంలోని భార్య లేదా కుమారుల్లో ఒకరికి ఉపాధిని కల్పించే

Published : 10 Aug 2022 04:49 IST

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ఆర్టీసీ

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. మెడికల్‌ అన్‌ఫిట్‌ విభాగంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి కుటుంబంలోని భార్య లేదా కుమారుల్లో ఒకరికి ఉపాధిని కల్పించే ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో జరిగిన ప్రమాదం కారణంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారి కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తరవాత వివిధ వైద్య కారణాలతో ఉద్యోగం నుంచి వైదొలగిన వారి కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారు. మూడేళ్లపాటు ఏకమొత్తం చెల్లింపు ప్రాతిపదికన గ్రేడ్‌-2 డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ కానిస్టేబుల్‌, శ్రామిక్‌ పోస్టుల్లో వారిని నియమిస్తారు.  మూడేళ్ల సర్వీసు పూర్తి తరవాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌ సర్వీసులోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని