‘సిరిచందన’ సౌగంధం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్లవిజయ్‌ మరమగ్గంపై 27 రకాల సుగంధద్రవ్యాలతో రూపొందించిన పట్టు చీరకు ‘సిరిచందన పట్టుచీర’ గా మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావులు నామకరణం చేశారు.

Published : 09 Oct 2022 05:45 IST

పరిమళ ద్రవ్యాలతో పట్టుచీర తయారీ

నేత కళాకారుడు నల్ల విజయ్‌ సృష్టి

విడుదల చేసిన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్లవిజయ్‌ మరమగ్గంపై 27 రకాల సుగంధద్రవ్యాలతో రూపొందించిన పట్టు చీరకు ‘సిరిచందన పట్టుచీర’ గా మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావులు నామకరణం చేశారు. ఈ చీర అద్భుతమని, నేతన్నల కళానైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడంతో పాటు తెలంగాణకు ఖ్యాతి తెస్తుందని ప్రశంసించారు. గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీర, మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టు లేని లాల్చీ, పైజామా, జాతీయ జెండాలను తయారుచేసిన విజయ్‌ ఈసారి వినూత్న ఆలోచనతో 27 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మరమగ్గంపై నేసి మరోసారి ప్రతిభ చాటుకున్నారు. దీనిని శనివారం ప్రగతిభవన్‌కు తెచ్చారు. ఈ సందర్భంగా చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీ రామారావు, ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు దానిని విడుదల చేశారు. విజయ్‌ను మంత్రులిద్దరూ అభినందించారు. సిరిసిల్ల నుంచి రాజన్న సిరిపట్టుచీరను ఇటీవలే విడుదల చేశామని, సుగంధద్రవ్యాల చీర సైతం కొత్త బ్రాండ్‌గా మారుతుందని కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రమణ, తదితర నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని