వరంగల్‌, కరీంనగర్‌ లాంటి నగరాలకు మేలు

గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి (రూరల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌- ఆర్‌ఐడీఎఫ్‌) తరహాలో పట్టణ మౌలిక సదుపాయాల నిధి (అర్బన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌- యూఐడీఎఫ్‌) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది.

Published : 02 Feb 2023 03:50 IST

యూఐడీఎఫ్‌ను ప్రకటించిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి (రూరల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌- ఆర్‌ఐడీఎఫ్‌) తరహాలో పట్టణ మౌలిక సదుపాయాల నిధి (అర్బన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌- యూఐడీఎఫ్‌) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ప్రాధాన్య రంగాలకు మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరతను తీర్చేందుకు ఇది ఉపకరించనుంది. రూ.10వేల కోట్లు దీని ద్వారా అందుబాటులోకి వస్తాయి.  టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వీలవుతుంది. రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, రామగుండం వంటి నగరాలకు మేలు జరుగుతుంది. పట్టణాభివృద్ధిలో ప్రణాళికా సంస్కరణలు కీలకమని కేంద్రం ప్రకటించింది. భూవనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించింది. అందరికీ అందుబాటులో పట్టణ భూములు, అవకాశాలు అనే లక్ష్యం పట్టణాభివృద్ధిలో కీలకమని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని