మార్పును ఆహ్వానిస్తూనే గ్రామాల పునాదులు కాపాడుకోవాలి

నవీనతను ఆహ్వానిస్తూనే గ్రామాల పునాదులను కాపాడుకోవాలని రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు.

Published : 08 Feb 2023 04:12 IST

‘ఊరుగాని ఊరు’ పుస్తకావిష్కరణలో మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: నవీనతను ఆహ్వానిస్తూనే గ్రామాల పునాదులను కాపాడుకోవాలని రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. పుట్టుక, జీవన విధానాలు ధ్వంసం చేయకుండా మార్పును ఆహ్వానించాలన్నారు. కోట్ల వనజాత రచించిన ‘ఊరుగాని ఊరు’ నవలను మంత్రి మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఛిద్రమైన గ్రామీణ జీవనంపై నవలలో వర్ణించిన తీరు హృద్యంగా ఉందన్నారు. రచయితలు తమ రచనల ద్వారా గ్రామాలు కోల్పోయిన విలువలు, సంబంధాలు, ఐక్యతను గుర్తు చేసి విలువల పునరుద్ధరణ కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో మారిన గ్రామాల పరిస్థితిపై మరిన్ని రచనలు రావాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ గౌరీశంకర్‌ ఆకాంక్షించారు. రచయిత్రి, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని