Zero Shadow Day: 9న మధ్యాహ్నం 12.12కు హైదరాబాద్‌లో నీడ కనిపించదు

నీడ కనిపించని ‘జీరో షాడో డే’ హైదరాబాద్‌లో ఈ నెల 9న మధ్యాహ్నం 12:12 గంటలకు ఏర్పడుతుందని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ టెక్నికల్‌ అధికారి ఎన్‌.హరిబాబుశర్మ తెలిపారు.

Updated : 03 May 2023 07:24 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: నీడ కనిపించని ‘జీరో షాడో డే’ హైదరాబాద్‌లో ఈ నెల 9న మధ్యాహ్నం 12:12 గంటలకు ఏర్పడుతుందని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ టెక్నికల్‌ అధికారి ఎన్‌.హరిబాబుశర్మ తెలిపారు. ‘‘ఆ సమయంలో హైదరాబాద్‌లో సూర్యకిరణాలు భూమిపై నిట్టనిలువుగా పడతాయి. 90 డిగ్రీల కోణంలో ఎండలో ఉంచిన ఏ వస్తువు నీడా రెండు నిమిషాల పాటు (12:12 నుంచి 12:14 వరకు) కనిపించదు. మనం ఎండలో నిలుచున్నా.. మన నీడ సైతం కనిపించదు’’ అని తెలిపారు. హైదరాబాద్‌లో ఆగస్టు 3న సైతం ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని వివరించారు. సమయంలో మార్పులతో అన్ని ప్రాంతాల్లో ఇది ఏర్పడుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని