మరో 4 కలెక్టరేట్ల ప్రారంభానికి సన్నాహాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ముఖ్యమంత్రి ·కేసీఆర్‌ వరుసగా జిల్లాల్లో పర్యటించనున్నారు.

Published : 27 May 2023 05:27 IST

జూన్‌ 4 నుంచి సీఎం చేతుల మీదుగా ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ముఖ్యమంత్రి ·కేసీఆర్‌ వరుసగా జిల్లాల్లో పర్యటించనున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్న సమీకృత జిల్లా పాలనాసౌధాలు(కలెక్టరేట్లు) మరో నాలుగింటిని ఆయన ప్రారంభిస్తారు. సన్నాహాలు పూర్తయ్యాయి. జూన్‌ 4న(ఆదివారం) నిర్మల్‌, జూన్‌ 6న(మంగళవారం) నాగర్‌కర్నూల్‌, జూన్‌ 9న(శుక్రవారం) మంచిర్యాల, జూన్‌ 12న(సోమవారం) గద్వాలలో వాటిని కేసీఆర్‌ ప్రారంభిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని