పీజీ ఈసెట్ ఫలితాల విడుదల
పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్ష (పీజీఈసెట్)-2023లో 93.94 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 19 సబ్జెక్టులకు 16,563 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 14,882 మంది పరీక్షలు రాశారు.
93.94% ఉత్తీర్ణత
19 విభాగాలకు 13,981 మంది..
ఆగస్టులో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
ఈనాడు, హైదరాబాద్: పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్ష (పీజీఈసెట్)-2023లో 93.94 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 19 సబ్జెక్టులకు 16,563 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 14,882 మంది పరీక్షలు రాశారు. అందులో 13,981 మంది కనీస మార్కులు సాధించి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పొందారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్ వీసీ, పరీక్ష ఛైర్మన్ కట్టా నర్సింహారెడ్డి, కన్వీనర్ ఆచార్య బి.రవీంద్రరెడ్డి, రెక్టార్ గోవర్ధన్ తదితరులు గురువారం జేఎన్‌టీయూహెచ్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ జాతీయస్థాయి పరీక్షలైన గేట్, గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ (జీప్యాట్)లో ర్యాంకులు సాధించిన వారికి తొలుత ర్యాంకులు కేటాయించాల్సి ఉందని.. అయితే ఇంకా జీప్యాట్ ఫలితాలు రాలేదన్నారు. అలాగే బీటెక్, బీఫార్మసీ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలు వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రవేశాల కౌన్సెలింగ్ జరుపుతామన్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సులకు సంబంధించి 231 కళాశాలలు ఉండగా వాటిలో 11,914 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ మాట్లాడుతూ ఎంసెట్ కౌన్సెలింగ్ నిమిత్తం వచ్చే వారంరోజుల్లో ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీజీఈసెట్ కో కన్వీనర్ సురేష్‌బాబు, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, సెట్ సమన్వయకర్త టి.శ్రీకాంత్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ