ఏపీ విద్యార్థులకు 200 స్థానికేతర ఎంబీబీఎస్‌ సీట్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తరవాత కొత్తగా ఏర్పడ్డ 7 ప్రభుత్వ, 5 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 15 శాతం స్థానికేతర సీట్లను రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ర్యాంకర్లకు ఊరట లభించింది.

Updated : 19 Jul 2023 05:23 IST

విజయవాడ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తరవాత కొత్తగా ఏర్పడ్డ 7 ప్రభుత్వ, 5 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 15 శాతం స్థానికేతర సీట్లను రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ర్యాంకర్లకు ఊరట లభించింది. సుమారు 200 ఎంబీబీఎస్‌ సీట్లను స్థానికులకే కేటాయించనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆల్‌ ఇండియా కోటా కింద 15 శాతం సీట్లు పోగా మిగిలిన 85 శాతం సీట్లను ఇక నుంచి లోకల్‌ అభ్యర్థులకే కేటాయించనున్నారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో 50 శాతం కన్వీనర్‌ కోటా సీట్లను లోకల్‌ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నెల్లూరులోని ఎ.సి.ఎస్‌.ఆర్‌.వైద్య కళాశాలలో (175 సీట్లు), తిరుపతి శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల (175), కొత్తగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటైన ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రి, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 ఎంబీబీఎస్‌ సీట్లు చొప్పున వచ్చాయి. ఆల్‌ ఇండియా కోటా కింద 165 సీట్లు పోగా మిగిలిన 935 సీట్లను ఆంధ్రా ప్రాంత విద్యార్థులతో భర్తీ చేయనున్నారు. ప్రైవేటు కళాశాలల్లో విశ్వభారతి(కర్నూలు), అపోలో(చిత్తూరు), గాయత్రి విద్యా పరిషత్‌ (విశాఖపట్నం), నిమ్రా (ఇబ్రహీంపట్నం), శ్రీ బాలాజీ (రేణిగుంట) కళాశాలల్లో ఒక్కో దాంట్లో 150 సీట్ల చొప్పున మొత్తం 750 ఉండగా, వీటిలో 50 శాతం ‘ఎ’ కేటగిరీ కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయనున్నారు. సుమారు 375 సీట్లు లోకల్‌ విద్యార్థులకే చెందనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని