ఐదేళ్లలో రామప్ప ఆలయానికి రూ.4.93 కోట్ల ఖర్చు

తెలంగాణలోని ప్రఖ్యాత రామప్ప ఆలయ నిర్వహణకు గత అయిదేళ్లలో రూ.4.93 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు.

Updated : 11 Aug 2023 05:32 IST

ఈనాడు, దిల్లీ: తెలంగాణలోని ప్రఖ్యాత రామప్ప ఆలయ నిర్వహణకు గత అయిదేళ్లలో రూ.4.93 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ఇందులో 2018-19 నుంచి 2021-22 వరకు రూ.2.30 కోట్లు వెచ్చించగా, 2022-23లో రూ.2.63 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాజ్యసభలో గురువారం భాజపా సభ్యుడు కె.లక్ష్మణ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.

49% సామర్థ్యంతోనే నడుస్తున్న ఏపీ విమానాశ్రయాలు

ఏపీలోని విమానాశ్రయాలు 48.95% ప్రయాణికుల సామర్థ్యంతోనే నడుస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ఎయిర్‌పోర్టుల వార్షిక గరిష్ఠ ప్రయాణికుల సామర్థ్యం 10.07 మిలియన్లు కాగా, 2022-23లో 4.93 మిలియన్ల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. తెలంగాణలోని ఎయిర్‌పోర్టుల గరిష్ఠ వార్షిక సామర్థ్యం 21.6 మిలియన్లు కాగా, 2022-23లో 21 మిలియన్ల (97.22%) మంది ప్రయాణించారు. గురువారం లోక్‌సభలో ఓప్రశ్నకు సమాధానంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ ఈ వివరాలను వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని